స్కామ్ మెసేజ్‌లకు చెక్! యూజర్లకు గూగుల్ సరికొత్త ఆప్షన్

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-03-19 14:57:42.0  )
స్కామ్ మెసేజ్‌లకు చెక్! యూజర్లకు గూగుల్ సరికొత్త ఆప్షన్
X

దిశ, ఫీచర్స్ : యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లు తన మెసేజింగ్ యాప్‌లో వాటిని బ్లాక్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో పాటు ‘ఫైండ్ మై డివైజ్’యాప్ ద్వారా లొకేషన్ షేరింగ్, బ్రౌజర్‌లో ప్రైస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలను కల్పించింది. SMS,MMS,RCSల ద్వారా వచ్చే సందేశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తిస్తుంది. అలాగే వాట్సప్ మెసేజింగ్ యాప్‌ మాదిరిగానే గూగుల్ ‘ఫైండ్ వై డివైజ్’అప్లికేషన్ సాయంతో లైవ్ లొకేషన్ షేర్ చేయవచ్చు. ఇది రియల్ టైమ్ మ్యాప్‌ను యాక్సెస్ చేసేందుకూ అనుమతిస్తుంది. ఈ క్రమంలో లొకేషన్ సమయం ఎంత యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో అనేది మీరే ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి వస్తువుల ప్రైస్ హిస్టరీ తెలుసుకొనేందుకు రకరకాల ఎక్స్ టెన్షను బ్రౌజర్ కు యాడ్ చేసుకుంటారు. దాని సాయంతో ధరల్ని ట్రాక్ చేయడం, ప్రైస్ అలర్ట్ లను సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇకపై ఏదైనా వస్తువును గూగుల్ క్రోమ్ ద్వారా వివరాలు తెలుసుకోవాలంటే అడ్రస్ బార్ లో ప్రైస్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ప్రైస్ హిస్టరీని మీరు చూడవచ్చు.

Read More..

viral video: వామ్మో.. నోట్ల వర్షం.. కాదు కాదు.. వరద.. తుపాను.. మీరు కూడా ఏరుకోండి!

Next Story