- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో ఈరోజు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. హలో ఒప్పందాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. బిల్ గేట్స్ తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్ లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారం పై కీలకంగా చర్చించామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ జరిగిందన్నారు.
అధునాతన సాంకేతికత పరిజ్ఞానాల వినియోగ అవకాశాలను పరిశీలించామన్నారు. పీ4, స్వర్ణాంధ్ర 2047 దార్శనికత సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్యసాధనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని గురించి చర్చించామని పేర్కొన్నారు. ఏపీ పురోగతి కి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.