- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Revanth Reddy: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బిగ్ రిలీఫ్ దక్కింది. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో నార్సింగ్ పీఎస్ లో రేవంత్ రెడ్డిపై 2020లో నమోదైన కేసును హైకోర్టు (High Court) కొట్టివేసింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు (KTR) చెందిన జన్వాడలోని పామ్ హౌస్ (Janwada Farm House) పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ నార్సింగ్ పోలీసులు 2020 మార్చిలో రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి 18 రోజులు జైలుకు తరలించారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది వాదన వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నార్సింగి పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.