వ్యవసాయ కూలి మృతి.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపణ…

by Aamani |
వ్యవసాయ కూలి మృతి.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపణ…
X

దిశ,గరిడేపల్లి : విద్యుత్ ప్రమాదంలో వ్యక్తికి విద్యుత్ వైర్ తగిలి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని పొనుగోడు గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొనుగోడు గ్రామానికి చెందిన కటికం గోపయ్య అనే రైతు వద్ద అదే గ్రామానికి చెందిన నేలపట్ల సైదులు (30) గత కొన్నేళ్లుగా వ్యవసాయ పనులు చూసుకునేందుకు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.

బుధవారం ఉదయం సైదులు పొలం వద్దకు నీళ్లను చూసేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ తెగి నేలపై ఉన్న ఎల్టి లైన్ విద్యుత్ వైర్ ను గమనించకుండా ఆ వైర్ కు తగలడంతో ఆ వైర్ కు విద్యుత్ సరఫరా అయి సైదులుకు తగలడంతో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విద్యుత్ వైరు తెగి నాలుగు రోజులు అవుతుందని విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదాన్ని కారణం విద్యుత్ అధికారులు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు.

Next Story