భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన మల్లారెడ్డి.. మాములుగా లేదుగా

by Mahesh |   ( Updated:2025-03-19 09:26:31.0  )
భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన మల్లారెడ్డి.. మాములుగా లేదుగా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) తనదైన వ్యవహార‌శైలితో నిత్యం వార్తల్లో ఎక్కుతుంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆయన వివిధ వేదికల్లో చేసిన ప్రతి ప్రసంగం, డాన్స్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతునే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన స్టార్ గా అవతరించాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఆయన చేసే డ్యాన్సులకు ప్రత్యేక అభిమానులు కూడా ఉంటారు. తాజాగా ఆయన భార్యతో కలిసి డ్యాన్స్ (Dancing with the wife) చేయడంతో ఆ స్టేజిపై ఉన్నవారంతా..ఉత్సాహంతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బోయిన్పల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మల్లారెడ్డి తన భార్యతో కలిసి మాస్ స్టెప్పులతో డాన్స్ చేశారు. అనంతరం మరో వీడియోలో కార్యకర్తలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి అక్కడ ఉన్నవారందరిని అలరించారు. ఈ వివాహ వార్షికొత్సవాల్లో మల్లారెడ్డి (Mallareddy)పై రాసిన ప్రత్యేక సాంగ్ ఆకర్షణగా నిలిచిందనే చెప్పుకొవాలి. కాగా హోలీ సందర్భంగా కూడా మల్లారెడ్డి చేసిన డాన్స్ వీడియోలు వైరల్‌గా మారగా.. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో తన వివాహ వార్షికోత్సవ వేడుకలను ఏడాది మొత్తం తన నియోజకవర్గం ప్రజలతో కలిసి దూమ్ దామ్ గా చేసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story