- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరికల్ కు జూనియర్ కాలేజ్ మంజూరు చేయండి..

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పరిణికా రెడ్డి మంగళవారం అసెంబ్లీ జీరో అవర్లో ముఖ్యంగా విద్యకు సంబంధించిన అంశాలపైనే ప్రస్తావించారు. మరికల్ మండల కేంద్రానికి జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని, అలాగే నారాయణపేట టౌన్ లో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల కాలేజ్ హాస్టల్ కు సొంత భవనం కేటాయించాలని దీనితో పాటు ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలోకి చేరిందని వెంటనే కొత్త భవనం మంజూరు చేయాలన్నారు.
కోయిలకొండ బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో స్థాయికి మించి విద్యార్థులు ఉన్నారని బిల్డింగ్ కూడా పురాతన కాలం నాటి దని పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణంలోకి పాములు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ కు సొంత భవనం కేటాయించాలని అసెంబ్లీలో సంబంధిత మంత్రులను, సీఎం రేవంత్ రెడ్డిని పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి విన్నవించారు. ఎమ్మెల్యే విన్నపానికి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.