- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిజామాబాద్ నుండి సిద్ధిపేటకు బస్సులు..

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నూతనంగా ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులను నిజామాబాద్ - 2 డిపో నుండి నడుపుతున్నారు. ప్రయాణీకుల సౌఖర్యార్థం నిజామాబాద్ నుండి సిద్ధిపేటకు ప్రతిరోజూ ఆరు ట్రిప్పులు నడుపుతున్నట్లు నిజామాబాద్ 2 డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఉదయం 05.45 గంటలకు నిజామాబాద్ నుండి మొదటి బస్సు బయలుదేరుతుందన్నారు. తర్వాత 06.30, 07.15 గంటలకు, మాధ్యాహ్నం 2.15, 3.15, 3.45 గంటలకు సిద్ధిపేటకు బస్సులు నడుస్తాయన్నారు. అలాగే, సిద్దిపేట నుండి నిజామాబాద్ కు కూడా ఆరు ట్రిప్పులు నడుపుతున్నామన్నారు. సిద్ధిపేట నుండి బయలుదేరే బస్సుల టైమింగ్స్ ఇలా ఉన్నాయి. 09.30, 10.15, 11.00, 18.00, 19.00, 19.30 గంటలకు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ అవకాశము సద్వినియోగం చేసుకుని సురక్షిత, సుఖవంతమైన ప్రయాణాన్ని పొందాలన్నారు. టీజీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి సహకరించగలని నిజామాబాదు 2 డిపో మేనేజర్ సాయన్న కోరారు.