- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. బీఆర్ఎస్ వీ నాయకుల అరెస్ట్..

దిశ, తంగళ్లపల్లి : అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వీ నాయకులను తంగళ్ళపల్లి మండలంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బయలు దేరిన టీఆరెఎస్వీ యూత్ నాయకులను సోమవారం తెల్లవారు జామున తంగళ్లపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్రమ అరెస్టులను విద్యార్థి నాయకులు ఖండించారు. సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డి దారిన రావచ్చు.. కానీ ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్పా..? అంటూ నిలదీశారు.
విద్యాశాఖను తనదగ్గర పెట్టుకొని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలనే కుట్రలు మానాలన్నారు. వందేళ్ల యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిర్బంధాలను కొనసాగించలేదన్నారు. ప్రజల తరుపున మాట్లాడే గొంతుకలు ఓయూ విద్యార్థులని, అలాంటి విద్యార్థుల స్వేచ్ఛ హరించే సర్క్యూలర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి ముట్టడికి బయలుదేరిన టీఆరెఎస్వీ యూత్ నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించారు. అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్, బొలవేని ఎల్లం యాదవ్, పొన్నాల చక్రపాణి, సయ్యద్ ఆఫ్రోజ్, భాస్కర్ ఉన్నారు.