వెజ్‌ లా అనిపించే నాన్‌వెజ్ ఫుడ్స్..? వెజ్ అనుకుని తినేస్తున్నారా..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-04 15:54:42.0  )
వెజ్‌ లా అనిపించే నాన్‌వెజ్ ఫుడ్స్..? వెజ్ అనుకుని తినేస్తున్నారా..!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో వెజ్‌, నాన్‌వెజ్ పదార్థాలు ఏవో అర్థం కాకుండా పోతుంది. రోజు ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు నాన్‌వెజ్ కిందకి వస్తాయంటే నమ్ముతారా? సాధారణంగా కొంతమంది వెజిటేరియ్ వాళ్లు అస్సలు నాన్‌వెజ్‌ తినరు. అది వారి ఆచారాలు, సంప్రదాయాల కారణంగా కావొచ్చు. మరికొందరు డైట్ ఫాల్ అవుతున్నాం అంటూ నాన్‌వెజ్‌ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ, వెజిటేరియన్స్ తెలియక నాన్‌వెజ్ ఫుడ్స్‌ను తినేస్తున్నారు. ఇవి శాకాహారంలా కనిపించే మాంసాహార పదార్థాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బటర్ నాన్: చాలామంది బటర్‌తో చేసిన పదార్థాలను ఇష్టంగా తింటుంటారు. రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు వెజిటేరియన్స్ బటర్‌నాన్‌ను ఆర్డర్ చేస్తారు. ఇది వెజిటేరియన్ అనుకుని తినేస్తుంటారు. కానీ, నిజానికి ఇది వెజ్ కాదు. బటర్ నాన్‌ను తయారు చేసేందుకు కావల్సిన పిండిలో ఎగ్ కలుపుతారు. దీని వల్ల పిండి సాప్ట్‌గా మారుతుంది. కొన్ని రెస్టారెంట్స్‌లో మాత్రం వీటిని ఎగ్ కలపకుండానే పిండిని ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఒకసారి రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు దాని గురించి అడిగిన తరువాత తినడం మంచిది.

ఛీజ్: కొందరు వెజిటేరియన్స్ శాండ్‌విజ్, పిజ్జా వంటివి నాన్‌వెజ్‌కు అల్ట్రానెట్‌గా తింటుంటారు. వీటిలో ఉండే చీజ్‌ను ఎంతోమంది ఇష్టపడుతుంటారు. ఛీజ్ అంటే చాలామందికి ఫేవరెట్ ఐటమ్. అయితే, ఈ ఛీజ్‌లో రెన్నెట్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిని జంతువు కడుపు నుంచి తీస్తారు. కాబట్టి ఇది నాన్‌వెజ్ కిందకే వస్తుంది. ఛీజ్‌ను తినాలని అనుకునే వారు దానిని కొనే ముందు ప్యాకేజ్ కవర్‌పై ఉన్న ఇంగ్రీడియన్స్‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్ చేసుకోవడం ఉత్తమం.

వైట్ షుగర్: పందార అనేది చెరుకు నుండి వస్తుంది. ఇది వెజిటేరియన్ అని అనుకుంటారు. కానీ, దీనిని పాలిష్ చేసేటప్పుడు ఫ్యాక్టరీలో బోన్ చార్‌ను ఉపయోగిస్తారు. అంటే జంతువుల ఎముకల నుంచి తయారు చేసిన పౌడర్‌ను వాడుతుంటారు. ఇది వెజిటేరియర్ కాదు. అయితే, అన్నీ రకాల పంచదారలో దీనిని కలపరు.

చూయింగ్ గమ్‌: చాలామంది చూయింగ్‌ గమ్‌ను మౌంత్ ఫ్రేష్‌గా ఉండడం కోసం తింటారు. నిజానికి ఈ చూయింగ్ గమ్‌ని తయారు చేసేటప్పుడు ఇందులో పందుల చర్మం, ఎముకల నుంచి తీసిన జెలటిన్ అనే పదార్థంను కలుపుతారు.

ఆరెంజ్: కొందరు నాన్‌వెజిటేరియన్స్ మార్నింగ్ లేదా డిన్నర్ టైమ్‌లో ప్యాక్ చేసిన ఆరెంజ్ జ్యూస్‌‌ను తాగుతారు. అయితే, ఈ ప్యాక్ చేసిన ఆరెంజ్ జ్యూస్‌లో చేపల నుంచి తీసిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను కలుపుతారు. ఇది నాన్‌వెజ్ కిందకే వస్తుంది.

డోనట్: డోనట్‌ను పిండితో తయారు చేసిన పదార్థం అనుకుని తింటారు. కానీ, ఇది నిజానికి నాన్‌వెజిటేరియన్ ఫుడ్.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Read More...

Coconut Water: కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?






Advertisement

Next Story