- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రాంతంలో ఉప్పు టీ చాలా స్పెషల్.. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
దిశ, ఫీచర్స్: టీ లవర్స్ గురించి తెలిసిందే. వాళ్లకు డే స్టార్ట్ అయ్యేది టీ తోనే. పొద్దుటే లేచి టీ తాగి మిగిలిన పనులు మొదలు పెడతారు. ఎంత పుష్టిగా ఆహారం తిన్నా.. టీ తాగకపోతే మాత్రం రోజంతా ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అంతలా టీ ను ఇష్టపడే వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక కొంచెం తలనొప్పి వచ్చిన, టెన్షన్ ఫీల్ అయినా టీ తాగేందుకే ఇష్టపడతారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,500 రకాల టీలు ఉన్నాయి. కానీ మనం వాటిలో చాలా తక్కువ వాడుకలో ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ, ఊలాంగ్, అల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ. అయితే.. ఉప్పు టీ గురించి తెలుసా..? దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?
సాధారణంగా టీ లో షుగర్ కలుపుకుని తాగుతారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో టీలో ఉప్పు కలుపుతారు. అంతే కాదు ఉప్పు టీ అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రజలు దీనిని ‘సులైమాని టీ’ అంటారు. దీనిని తాగేందుకు పక్క ప్రాంతాల వారు కూడా వస్తారంట. నిజానికి ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కడ ప్రజల అభిప్రాయం. సులైమాని టీ గొంతు నొప్పి సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతోందట. అంతే కాకుండా ఈ టీ తాగడం వల్ల గొంతులో టాన్సిల్స్ కూడా తగ్గుతాయట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. చాలా మంది ఇది విని షాక్ అవుతున్నారు. అంతే కాకుండా చలికాలంలో టీలో చిటికెడ్ సాల్ట్ కలుపుకుని తాగితే మంచిదని సూచిస్తు్న్నారు అక్కడి నిపుణులు.