- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సువాసనలతో డిప్రెషన్ దూరం.. ఇక చికిత్స సులభం కావచ్చు
దిశ, ఫీచర్స్ : సువాసనలు వాస్తవానికి మంచి అనుభూతిని కలిగిస్తాయి. రకరకాల పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, వివిధ పదార్థాల వాసనలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కొన్నిసార్లు అవి గత జ్ఞాపకాలను కూడా తట్టి లేపుతుంటాయి. అయితే డిప్రెషన్ బాధితులకు చికిత్సను అందించడంలోనూ సహాయపడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవ ఘ్రాణ వ్యవస్థకు, జ్ఞాపకశక్తికి మధ్య బలమైన కనెక్షన్ ఉంటుందనే విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు సుపరిచితమైన వాసనలు జ్ఞాపకాలను గుర్తు చేయడంలో, డిప్రెషన్ అండ్ నెగెటివ్ థాట్స్‌తో పోరాడటంలో సహాయపడతాయని పిట్స్‌బర్గ్(Pittsburgh) యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని రేకెత్తించే విషయంలో ‘వాస్తవ పదాలు’ కంటే సువాసనలు మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు వారు గుర్తించారు. పైగా ఆలోచనా విధానాలను తిరిగి మార్చడంలో సహాయపడుతున్నందున ఫాస్టర్ అండ్ స్మూతర్ హీలింగ్‌లో వాటిని అన్వయించడంపై పరిశోధనలు చేస్తున్నారు.
ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్
డాక్టర్ కింబెర్లీ యంగ్ తన ఆటో బయోగ్రఫికల్ మెమోరీస్‌పై దృష్టి సారించే న్యూరోసైన్స్ పరిశోధకురాలు. ఆమె తన బృందంతో కలిసి అమిగ్డాలా లేదా మెదడులోని రెప్టీలియన్ భాగం ‘‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ రెస్పాన్స్‌కు గల కారణాలపై పరిశోధనలు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమైన సంఘటనలపై దృష్టిని కేంద్రీకరించడం, మెమోరీని రీకాల్ చేయడంలో సువాసనలు కూడా సహాయపడుతున్నట్లు కనుగొంది. డిప్రెషన్‌తో బాధితుల్లో సువాసనలు నిరాశకు పారదోలుతుండగా, ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా అవి స్పష్టమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తాయని నిర్ధారించారు. గ్రహణ శక్తిలో ఉద్భవించే నరాల కనెక్షన్‌ల ద్వారా వాసనలు మెదడులోని అమిగ్డాలాను నిమగ్నం చేయడం ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రాబ్లం సాల్వింగ్, భావోద్వేగ నియంత్రణ
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు డిప్రెషన్ బాధితులను రెండు సమూహాలుగా విభజించారు. ఒక సమూహం తరచుగా సువాసలనకు గురయ్యే పరిస్థితిని కలిపించారు. మరొక సమూహాం ఇటువంటి వాతావరణానికి దూరంగా ఉండేలా చూశారు. అయితే మొదటి సమూహాం తరచూ వివిధ రకాల పూల మొక్కలు, పువ్వులతోపాటు నారింజ, గ్రౌండ్ కాఫీ, షూ పాలిష్ , విక్స్ వాపోరబ్ వంటి వాసనలను ఆస్వాదించడంవల్ల డిప్రెషన్ లక్షణాలు త్వరగా తగ్గినట్లు, జ్ఞాపకశక్తి పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే సువాసనలు పీల్చనటువంటి డిప్రెషన్ బాధితుల్లో ఎటువంటి మార్పు సంభవించలేదు. దీంతో సువాసనలు క్లినికల్ సెట్టింగ్‌లలో డిప్రెషన్ బాధితులకు చికిత్స అందించడంలో అద్భుతంగా పనిచేస్తాయని రీసెర్చర్స్ నిర్ధారణకు వచ్చారు. వాటిని చికిత్సా రూపంలోకి మార్చగలిగితే ప్రాబ్లం సాల్వింగ్, భావోద్వేగ నియంత్రణ, డిప్రెషన్ రిలేటెడ్ సమస్యల నివారణ మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు.