గబ్బిలాల డీఎన్ఏ‌తో మధుమేహం తగ్గుతుంది.. పరిశోధనలో వెల్లడి

by Javid Pasha |
గబ్బిలాల డీఎన్ఏ‌తో మధుమేహం తగ్గుతుంది.. పరిశోధనలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : రాత్రి మేల్కొంటూ పగలంతా చెట్లకు వ్రేలాడి ఉండే ఒక రకమైన బ్రౌన్ కలర్ లేదా నల్లటి పక్షుల గురించి మీకు తెలుసా? వీటినే గబ్బిలాలు అని కూడా అంటారు. వాస్తవానికి ఆకారం కారణంగా కొందరికి వీటిని చూసినప్పుడు కాస్త భయం అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఇవి యాంటీ డయాబెటిక్ మెడిసిన్‌ తయారీలో కీలకంగా మారవచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయగల మందులను కనుగొనే అన్వేషణలో వారు గబ్బిలాలపై పరిశోధనలు జరిపారు. ముఖ్యంగా గబ్బిలాల్లో ఒక రకమైన జాతికి చెందిన ఫ్రూట్ బ్యాట్స్‌లోని డీఎన్ఏలో డయాబెటిస్‌ను వేగంగా తగ్గించగల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) రోజుకు 20 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతాయి. డైలీ 4 గంటలపాటు అధిక చక్కెరలు కలిగిన తియ్యని పండ్లను తింటాయి. రీసెర్చ్‌లో భాగంగా శాస్త్రవేత్తలు వీటిని పరీక్షించగా అవి ఎక్కువ చక్కెరలు తిన్నా వాటి ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడట్లేదని కనుగొన్నారు. ఇది మనుషుల్లో ఎందుకు జరగదనే అనుమానంతో మరింత లోతుగా పరిశోధనలు జరిపారు. దీనివల్ల తేలిందేమిటంటే.. డయాబెటిస్ శరీరంపై దాడి చేసిప్పటికీ దానిని ఎదుర్కోవడానికి ఫ్రూట్ బ్యాట్స్ తమ రక్తంలో చక్కెర స్థాయిలను స్వయంగా నియంత్రించుకోగలుగుతాయి. అదే మనుషుల్లో అయితే ఒకసారి డయాబెటిస్ బారిన పడితే శరీరం ఇన్సులిన్‌ను ప్రొడ్యూస్ చేయదు లేదా యాక్టివ్‌గా ఉండదు. కానీ ఫ్రూట్ బ్యాట్స్ ఇందుకు భిన్నంగా డయాబెటిస్‌ను, బ్లడ్ షుగర్‌ను నింయత్రించుకోగలిగే జెనెటిక్ మెకానిజం కలిగి ఉన్నాయి. అందుకని గబ్బిలాల డీఎన్ఏ మధుమేహాన్ని నివారించే మెడిసిన్‌గా యూజ్ చేయవచ్చని పరిశోధకులు నిర్ధారించారు.

Advertisement

Next Story