క్యాబేజీలో అద్భుత పోషకాలు.. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యానికి కూడా..

by Javid Pasha |
క్యాబేజీలో అద్భుత పోషకాలు.. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యానికి కూడా..
X

దిశ, ఫీచర్స్ : ఎల్లప్పుడూ లభించే కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. చాలా మంది దీనిని సాధారణ కూరగాయగా భావిస్తుంటారు కానీ ఇందులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఆహారంలో భాగంగా తరచుగా తీసుకోవడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా క్యాబేజీ రసంలో గ్లూటెమిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది యాంటీ అల్సర్ గుణాలను కలిగి ఉంటుంది. కడుపులో మంట, ప్రేగుల్లో ఇబ్బందులు వంటివి తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

బ్రాసికా కాయగూరల ఫ్యామిలీకి చెందిన క్యాబేజీలో రెడ్ అండ్ గ్రీన్.. రెండు రకాలు ఉంటాయి. రెడ్ క్యాబేజీ రేర్‌గా దొరకడంవల్ల ఎక్కువమంది ఉపయోగించరు. ఇక గ్రీన్ క్యాబేజీ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ గ్రీన్ క్యాబేజీలో ఉండే క్రోమియం కంటెంట్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో, బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా సహాయపడుతుంది. పైగా ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. పొటాషియం, ఐరన్, విటమిన్స్ తగినంతగా కలిగి ఉండటంవల్ల అందరికీ మంచిది.

క్యాబేజీలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది. ఇది కంటిలోపల మచ్చలు, కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి కలిగి ఉండటంవల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. విటమిన్ కె. పుష్కలంగా ఉంటుంది కాబట్టి అల్జీమర్స్‌ను నివారిస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల మలబద్దకాన్ని, అధిక బరువు సమస్యను నివారించడంలో హెల్ప్ అవుతుంది. అట్లనే అన్ని రకాల విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నందువల్ల స్కిన్ అలెర్జీలు రాకుండా ఉండటమే కాకుండా, వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంలో, చర్మసౌందర్యాన్ని పెంచడంలో క్యాబేజీ సహాయపడుతుంది. ల్యాక్టిక్ ఆమ్లం కలిగి ఉన్నందున గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed