ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్‌.. అధ్యయనంలో వెల్లడి

by Prasanna |   ( Updated:2023-04-29 15:34:14.0  )
ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్‌.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్: ఓరల్ సెక్స్ ద్వారా గొంతు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందా?.. అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. వ్యక్తుల టాన్సిల్స్ ప్రాంతంలో, గొంతు వెనుక భాగంలో వచ్చే క్యాన్సర్ తరచుగా లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల వస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే 21వ శతాబ్దం ప్రారంభం నుంచి పాశ్చాత్య దేశాలలో గొంతు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో దీనిపై ఫోకస్ పెట్టిన సైంటిస్టులు దీనిని ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తున్న ‘అంటువ్యాధి’ అని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఓరోఫారింజియల్ అని పిలువబడే ఒక రకమైన గొంతు క్యాన్సర్‌ పెద్ద ఎత్తున పెరుగుతుండటం శాస్త్రవేత్తలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఇది లైంగికంగా సంక్రమించే హెచ్‌పీవీ వైరస్ (HPV) ద్వారానే వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ జెనోమిక్ సైన్సెస్‌లోని ప్రొఫెసర్ హిషామ్ మెహన్నా తెలిపారు. మల్టిపుల్ సెక్స్ పార్టనర్స్ ద్వారా, ఓరల్ సెక్స్‌ను ప్రాక్టీస్ చేసే వ్యక్తులు తమ జీవితకాలంలో ఈ రకమైన గొంతు క్యాన్సర్‌ను పొందే ప్రమాదం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు.

ఎవరికి ఎక్కువగా వస్తుంది?

‘కేస్-కంట్రోల్ స్టడీ ఆఫ్ హెచ్‌పీవీ, ఒరోఫారింజియల్ క్యాన్సర్ స్టడీ’ ప్రకారం.. జీవితకాలంలో ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పార్టనర్స్‌తో ఓరల్ సెక్స్ అనుభవం కలిగి ఉన్న వ్యక్తుల్లో ఇతరులతో పోల్చినప్పుడు ఓరోఫారింజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 8.5 రెట్లు ఎక్కువ. ఆ విధమైన సెక్స్‌పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్న యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో గర్భాశయ క్యాన్సర్ కంటే కూడా ఓరోఫారింజియల్ క్యాన్సర్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ దాదాపు ప్రతీ 1,000 మంది వ్యక్తులలో, 80 శాతం మంది పెద్దలు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఓరల్ సెక్స్‌లో పాల్గొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని ప్రొఫెసర్ మెహన్నా తెలిపారు.

హెచ్‌పీవీ టీకాతో నివారణ

గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇచ్చే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తున్న గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే యువతులకు 85 శాతం వరకు హెచ్‌పీవీ(HPV) వ్యాక్సిన్ వేయడాన్ని అమలు చేసిన దేశాల్లోని పురుషులు ఓరల్ సెక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ హ్యూమన్ పాపిల్లోమావైరస్ బారినడ పడేరేటు తక్కువగా ఉంటోంది. అయినప్పటికీ హైపర్ కనెక్టివిటీ లైంగిక సంబంధాలను కలిగి ఉన్నప్పుడు హెచ్‌పీవీ కూడా పూర్తిగా రక్షణ ఇస్తుందన్నది వందశాతం గ్యారెంటీ ఇవ్వలేమని కూడా పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువమంది భాగస్వాములతో ఓరల్ సెక్స్ వంటి చర్యలకు దూరంగా ఉండటం బెటర్ అని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

మెదడులో ఆందోళనను తగ్గించే జన్యువును కనుగొన్న సైంటిస్టులు

Advertisement

Next Story

Most Viewed