- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Twins : దంపతుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. కవల పిల్లలు గ్యారంటీ..
దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్క జంటకు తల్లిదండ్రులు అవ్వాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. బోసి నవ్వులతో చిన్నారి తమ ఇంట్లో అడుగు పెట్టాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అలాంటి ఒక బుజ్జి అతిథి ఇంట్లోకి వచ్చారంటే చాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి. అదే ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు పుడితే ఆనందం రెట్టింపు అవుతుంది. ఇక మరికొన్ని జంటల్లో ఒకే కాన్పుకు ముగ్గురు, నలుగురు పిల్లలు పుడతారు. ఈ జంటలకు కవల పిల్లలు ఎలా పుడతారు అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆఫ్రికా, ఆసియాల్లో కవలల జననాలు 80 శాతంగా ఉంటున్నాయని కొంతమంది పరిశోధకులు తెలుపుతున్నారు. ఇక UK విషయానికి వస్తే 1,000 మంది జనాభాలో సుమారు 15 నుంచి 17 మంది కవలలు జన్మిస్తున్నారని చెబుతున్నారు.
ఇక పోతే కవల పిల్లల జననాలలో కూడా రెండు రకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వారిలో కొంతమంది మోనోజైగోటిక్ కవలలు ఉంటే మరికొంతమంది ఒకేరూపు రేఖలతో కవలలుగా జన్మిస్తారు. ఓకే రూపంలో జన్మించే పిల్లలు ఒకే అండాన్ని అలాగే ఒకే ప్లాసెంటాను పంచుకుంటారట. అంతే కాదు ఆహారాన్ని కూడా వారిద్దరూ పంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు. రెండో రకం కవలలను డైజిగోటిక్ కూడా పిలుస్తారు. ఈ విధానంలో స్త్రీ గర్భంలో రెండు అండాశయాలు ఏర్పడి ఆ రెండు వేరు వేరు స్పెర్మ్‌లతో ఫలదీకరణం అవుతాయంటున్నారు వైద్యనిపుణులు.
ఇక పోతే కవల పిల్లలు ఎలాంటి జంటల్లో ఎక్కువగా కలుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వీకుల కాలం నుంచి మాతృ కుటుంబంలో కవలలు పుట్టినట్టయితే ఆ కుబుంబంలోని జంటలకు కవలలు కలిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని జన్యుపరమైన కారణాల ద్వారా కూడా కవలలు జన్మిస్తారట.
మహిళల్లో 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా ఏర్పడుతుందట. దీంతో ప్రతిచక్రానికి పిండం పరిపక్వం చెందేలా చేస్తుందట. FSH స్రావం పెరగడంతో అండాల సంఖ్యకూడా రెట్టింపు అవుతుందంటున్నారు నిపుణులు. ఈ సంఖ్యతో కవలల పుట్టుకకు అవకాశాలు ఉన్నాయంటున్నారు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.