రూ. 500 చెల్లిస్తే జైలు జీవితం.. ఉత్తరాఖండ్‌లో అధికారుల ఆఫర్

by sudharani |
రూ. 500 చెల్లిస్తే జైలు జీవితం.. ఉత్తరాఖండ్‌లో అధికారుల ఆఫర్
X

దిశ, ఫీచర్స్ : ఉత్తరాఖండ్‌, హల్ద్వానీలోని జైలు పరిపాలన విభాగం రూ. 500 చెల్లిస్తే ఒక్క రాత్రికి జైలులో గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు 'చెడు కర్మలను' తొలగించాలనుకునే ప్రజలకు రియల్ లైఫ్ జైలు జీవితానుభవం పొందేలా సాయపడుతున్నారు. ఇక 1903లో నిర్మించబడిన ఈ హల్ద్వానీ జైలులో ఆరు సిబ్బంది క్వార్టర్‌లతో కూడిన పాత ఆయుధశాల ఉంది. ఇక్కడ వదిలివేసిన భాగాన్ని 'జైలు అతిథులు' కోసం సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ సతీష్ సుఖిజా తెలిపారు.

'సిఫార్సు చేయబడిన వ్యక్తులను' జైలు బ్యారక్‌లో కొన్ని గంటలు గడిపేందుకు అనుమతించాలని తరచూ సీనియర్ అధికారుల నుండి సిబ్బందికి ఆదేశాలు అందుతున్నాయి. కాగా ఈ 'పర్యాటక ఖైదీలకు' జైలు యూనిఫారంతో పాటు అక్కడి వంటగదిలో తయారు చేయబడిన ఆహారం అందించబడతుంది. అయితే కొందరికి తమ జాతకాల్లోని 'బంధన్ యోగం' తొలగించుకునేందుకుగాను జ్యోతిష్య నిపుణులు ఇలా ఒక రాత్రి జైలులో గడపమని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక జనాలకు జైలులో ఇలాంటి ఫెసిలిటీ కల్పించడంపై స్పందించిన జైలు అధికారి.. 'జైలు లోపల ఒక పాడుబడిన భాగం ఉంది. ఇలాంటి ఖైదీలకు నామమాత్రపు రుసుము(రూ. 500)తో ఒక్క రాత్రికి జైలులో వసతి కల్పించేందుకు దీన్ని డమ్మీ జైలుగా అభివృద్ధి చేయొచ్చు' అని తెలిపారు.

'ఒకరి జాతకంలో లేదా జన్మకుండలిలో శని, అంగారకుడు సహా మూడు ఖగోళ వస్తువులు అననుకూల స్థితిలో ఉన్నపుడు ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవిచాల్సి ఉంటుందని అంచనావేసే సమీకరణంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో సాధారణంగా ఒక రాత్రి జైలులో గడపమని, ఖైదీలకు భోజనం అందించమని సలహా ఇస్తాం. తద్వారా గ్రహ స్థానాల్లోని చెడు ప్రభావాలను దాటవేయొచ్చు.

- మృత్యుంజయ్ ఓజా, జ్యోతిష్కుడు, హల్ద్వానీ

ఇవి కూడా చదవండి : అమ్మాయితో సెక్స్‌కు రెడీ అయిన ఆంటీ.. పోలీసులు వద్దని చెప్పినా ఏడాదిన్నరగా..

Next Story