- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అక్కా.. నీదే బాధ్యత.. రాఖీ పండుగ స్పెషల్.. బ్రదర్స్‌ను ఇలా సంతోష పెట్టండి..!
దిశ, ఫీచర్స్ : చిన్ను.. హ్యాపీ రక్షా బంధన్. నీ చేతికి రాఖీ కడుతున్నప్పుడు నా కళ్లలో తిరిగే కన్నీరు.. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంది. నా గొంతు దగ్గరే ఆగిపోయిన భావోద్వేగంతో కూడిన దుఃఖం.. నువ్వు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటుంది. కట్నం లేదు కాళ్లు మొక్కుతా అని చెప్పేటప్పుడు వచ్చే నవ్వు.. జీవితంలో ప్రతిక్షణం నా తమ్ముడికి ఆనందాన్ని అందించాలని ప్రార్థిస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే నా భుజంపై చేయి వేసి.. నువ్వు ఇచ్చే భరోసా ఉంటుందే.. ఏ కష్టం వచ్చినా ఈజీగా పక్కకు పొమ్మనేంత ధైర్యాన్ని ఇస్తుంది. అక్కగా నీకు ఏం నేర్పానో తెలియదు కానీ సోదరుడిగా నువ్వు ధర్మరాజు స్థానంలో ఉండి నన్ను అర్జునుడిని చేసావు. సత్యం, సహనం సదా తోడుండాలని చెప్పే నువ్వు.. తెగింపు కూడా ముఖ్యమని నూరిపోశావు. రెండేళ్లు వెనుక పుట్టినా నా కన్నా ఎక్కువగా లోకాన్ని చూసి, అర్థం చేసుకుని.. ఆ అనుభవాలను పంచుతూ అలర్ట్ చేసావు, చేస్తున్నావు. నిన్ను మించిన రక్షణ నాకు ఎక్కడ లేదు.. దొరకలేదు.. రియల్లీ ఐ మీన్ ఇట్..
నా తమ్ముడు నేర్పిన పాఠాల నుంచే రాఖీ సందర్భంగా మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అక్క. సోదరుడి కన్నా సోదరి పెద్దది అనుకున్నప్పుడు... తనకు అమ్మగా మారుతుంది. తను ఏం చెప్పినా వినేందుకు సిద్ధంగా ఉంటాడు. అలాంటి అవకాశాన్ని మనం సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు వినియోగించవచ్చు. మార్పు మన ఇంట్లో మొదలైతే.. సొసైటీలో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందుకే.. పితృస్వామ్య సమాజం మన అన్నాదమ్ముళ్లకు పెట్టిన కండిషన్స్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేద్దాం. అబ్బాయి అంటే ఇలాగే ఉండాలనే ఆలోచనలు చిన్నప్పటి నుంచే పురుడు పోసుకునేలా చేస్తున్న ఈ సంప్రదాయపు కంచెలను బ్రేక్ చేస్తే ఈ విషపూరితమైన మగతనం అనే ముసుగు నుంచి మన సోదరులకు రిలీఫ్ ఇవ్వొచ్చు. వారికి నచ్చిన విధంగా జీవించేలా మద్దతివ్వచ్చు.
పితృస్వామ్య వ్యవస్థ అమ్మాయిలు సుకుమారంగా ఉండాలని చెప్తుంది. అలాగే పెంచుతుంది. రఫ్ అండ్ టఫ్ ఉండాలనుకున్నా వారిస్తుంది. ఎదురు చెప్తే అమ్మాయిలు అలా ఉండొద్దని అంటుంది. అన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెప్తుంది.
ఇంటి బాధ్యతలు తీసుకుందామని అనుకున్నా... అన్నాదమ్ములు ఉన్నారు కదా అని గుర్తుచేస్తుంది. ఈ విషయంలో మగపిల్లలను దోపిడీ చేస్తుంది. మానసికంగా అణిచివేస్తుంది. సమాజం క్రియేట్ చేసిన ఒక బాక్స్ లో మాత్రమే జీవితాన్ని అనుభవించాలి అన్నట్లుగా హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ ఇది సమంజసం కాదు. బాధ్యతలు కేవలం అబ్బాయివే కాదు.. అమ్మాయికి కూడా పంచాలి. ఇద్దరు సమానంగా హక్కులు, బాధ్యతలు అనుభవించేలా పెంచాలి.
'అబ్బాయిలు ఏడవకూడదు' , ' అమ్మాయిల లెక్క ఆ ఏడుపు ఏంది ', ' ఆడ పిల్లలా నడుస్తున్నావ్ ఏంటి ' అనే బూతులు వింటూనే ఉంటాం. ఇక్కడ అమ్మాయిని ఎంతగా అవమానిస్తున్నారో.. అబ్బాయిని కూడా అంతకు మించి మెంటల్ గా స్ట్రెస్ చేస్తున్నారు. అలా ఉండకూడదు ఇలా ఉండాలని ఒత్తిడికి గురి చేస్తున్నారు. మృదువుగా, విధేయతగా ఉన్నా క్రమశిక్షణతో ఇంటిపట్టునే కూర్చున్నా.. అమ్మాయి తిరిగి చెడితే అబ్బాయి తిరగక చెడ్డాడు అనే సామెతలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అవమానిస్తుంది. ఇలాంటి మాటలు ప్రతికూలంగా కూడా ప్రభావితం కావచ్చన్న విషయం జనాలకు తెలిసినా ఇదే కంటిన్యూ అవుతుంది. అందుకే ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి అక్క. నీ తమ్ముడిని తనకి నచ్చిన విధంగా ఉండొచ్చని పెంచాలి. ఇలాంటి సామెతలు ట్రాష్.. నీ మనసు చెప్పిన మాట వింటూ హాయిగా జీవించమని సూచించాలి. బాధ్యతల భారం ఇద్దరం పంచుకుందామని చెప్పాలి.
ఎందుకంటే 'అబ్బాయిలు ఏడవకండి' అని తల్లితండ్రులు కొడుకుతో చెప్పినప్పుడు, అది అతను చేయకూడని పని అని, అతని మనస్సులో ఏదో ఒక ఆలోచనను సృష్టిస్తుంది. కానీ నిజానికి ఏడవడం అనేది స్ట్రెస్ బస్టర్ గా పని చేస్తుందని.. కన్నీళ్లు ఉపశమనాన్ని ఇస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. అందుకే సోదరీమణులు మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడంలో సోదరులకు సహాయం చేయాలి. సహోదరుడు తన భావాలను వ్యక్తపరచడం, అతని భావోద్వేగాలను బయటపెట్టడం సరైందేనని తెలియజేసేందుకు ఆరోగ్యకరమైన చర్చను ప్రారంభించాలి. ఏడిస్తే ఫర్వాలేదు.. అది అతనిని మనిషిగా ఏ మాత్రం తగ్గించదు. పురుషులు సామాజిక అంచనాలకు అనుగుణంగా నిలబడాలని ఆశించే ' మ్యాన్లీ మ్యాన్ ' రొమాంటిక్ కథనాన్ని ఇప్పటికైనా అవాయిడ్ చేద్దాం. సమస్యాత్మక సామాజిక నిర్మాణం బాధితులుగా ఉన్న అక్కలు బాధితులు కాబట్టి వాటి నుంచి సోదరులను కాపాడాలి. లింగంతో కూడిన మూస పద్ధతుల చుట్టూ ఉన్న బుడగలను పగలగొట్టాలి.
పురుషులు మంచి కుటుంబాన్ని నిర్మిస్తారు, రక్షకులు, సంపాదకులు అనే భావన చాలా చిన్న వయస్సు నుంచే అవాంఛనీయ అంచనాలతో పురుషులను భారం చేస్తుంది. 'నువ్వు చదువుకోకపోతే ఎవరు సంపాదిస్తారు? ఎవరూ మిమ్మల్ని పెళ్లి చేసుకోరు' అంటారు. అలా కాకుండా వంట చేస్తా, ఇంటి పట్టునే ఉండి పిల్లలను చూసుకుంటా, నా భార్య గొప్పగా సంపాదిస్తుంది అని ఒక అబ్బాయి చెప్తే సొసైటీ చిన్నచూపు చూసే పద్ధతికి స్వస్తి పలుకుదాం. ఈ బాధ్యత తీసుకుందాం....
- Tags
- Raksha Bandhan