Radish Festival : ముల్లంగి సంబురం.. అక్కడ చాలా స్పెషల్ గురూ!

by Javid Pasha |   ( Updated:2024-11-12 15:33:08.0  )
Radish Festival : ముల్లంగి సంబురం.. అక్కడ చాలా స్పెషల్ గురూ!
X

దిశ, ఫీచర్స్ : ముల్లంగి.. ఈ కూరగాయను, దాని ఆకులను ఏం చేస్తారో తెలిసిందే. కొందరు కూరగా వండుకొని తింటే.. మరికొందరు పచ్చిగానూ తింటుంటారు. అయితే ఒక దేశంలో మాత్రం దీనితో పెద్ద వేడుకే జరుపుకుంటారు. అందుకోసం ప్రజలు మేలైన, తాజా ముల్లంగిని సేకరిస్తారు. అందరూ ఒక చోటకు చేరి ఆనందోత్సాహాల మధ్య ముల్లంగి వంటకాలను, కాయగూరలను, ఆకు కూరలను ప్రదర్శిస్తారు. ఇంతకీ ఈ ముల్లంగి సంబురం జరిగేది ఎక్కడో అనుకుంటున్నారా? మెక్సికోలోని ఓక్సాకాలో. ‘లా నోచో డి రాబోనోస్’ (The Knight of the Radish) పేరిట ఏడాదికోసారి జరుపుకుంటారు. కాగా ఇక్కడ అత్యధికంగా ఎర్రముల్లంగినే పండిస్తారు.

అందమైన ఆకృతులుగా చెక్కి..

ప్రతీ ఏడాది డిశంబర్ వచ్చిందంటే చాలు మెక్సికోలోని ఓక్సాకాలో ముల్లంగి సంబురాల సందడి మొదలవుతుంది. ఆ రోజు ఇక్కడి రెస్టారెంట్లలో కూడా ఎక్కువగా ముల్లంగి స్పెషల్ వంటకాలే కనిపిస్తాయి. దాదాపు డిసెంబర్ 20 నుంచి 23 తేదీ వరకు ఈ వేడుక నిర్వహిస్తారు. చివరి రోజు ముఖ్యమైన పండుగా భావిస్తారు. ఎంతో మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొనే ఏ ముల్లంగి సంబురం రోజు వివిధ కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా ఈ వేడుక కోసం రైతులు అప్పుడే నేలలో నుంచి తీసుకొచ్చిన ఎర్రటి తాజా ముల్లంగిని నీట్‌గా కడిగి వేడుక కోసం రెడీ చేస్తారు. ఇక కొంతమంది కళాకారులు వీటిని నిర్ణీత మసయంలో విభిన్న డిజైన్లలో, అందమైన ఆకృతులుగా చెక్కుతారు. అలా తీర్చిదిద్దిన వాటిలో అత్యంత అట్రాక్టివ్‌గా ఉండే దానికి బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు.

19వ శతాబ్దంలోనే అలా..

ముల్లంగి సంబురం అనేది మెక్సికోలో 19వ శతాబ్దపు చివరిలో పురుడు పోసుకుందని అక్కడి సాంస్కృతిక నిపుణులు చెప్తుంటారు. అప్పట్లో ఓక్సాకా పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగులో ముల్లంగికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ప్రతి ఏటా డిసెంబర్‌లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఓక్సాకా మార్కెట్‌లో ఎటు చూసినా ముల్లంగి కాయగూరలే కనిపించేవట. అయితే ఆ సమయంలో కొనుగోలు దారులను ఆకర్షించడానికి రైతులు ముల్లంగీలలో కొన్నింటిని కళాత్మక ఆకృతుల్లో చెక్కి ప్రదర్శించేవారు. వాటిని చూసేందుకని అక్కడ నిలబడి ఉన్నవారు, తర్వాత తినడానికి ముల్లంగిలను కూడా కొనుగోలు చేసేవారట. అలా రైతులు కాస్త పోటీదారులుగా మారి, తమ ముల్లంగి ఉత్పత్తులను ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం తర్వాత కాలంలో ఓ వేడుకగా మారిపోయింది. 1897 నాటికి ఓక్సాకోలోని స్థానికులు ముల్లంగిని కళాత్మకంగా చెక్కే పోటీలు కూడా నిర్వహించునేంత వరకూ ఈ సంబురం చేరుకోవడంతో స్థానికి మున్సిపాలిటీ దీనిని అధికారికవేడుకగా ప్రటించింది.

Read More ...

తేనేటీగలు అంతరించిపోతే మానవ జాతికే ముప్పు..!




Advertisement

Next Story