గంగిరెద్దుకు క్యూఆర్ కోడ్ స్కానర్

by GSrikanth |   ( Updated:2023-01-23 06:03:32.0  )
గంగిరెద్దుకు క్యూఆర్ కోడ్ స్కానర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం క్యాష్ కంటే ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్‌కే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. షాపింగ్‌మాల్స్, దుకాణాలు, హాస్పిటల్స్, థియేటర్స్, ఆఖరికి కూరగాయలు, పండ్లు అమ్మే బండ్లపై కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి వేళ ఎవరు ఊహించని చోట క్యూఆర్‌కోడ్ స్కానర్ దర్శనమిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం భోగి పండుగ సంబురాలను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే, సంక్రాంతి అంటే ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది హరిదాసు, గంగిరెద్దుల కోలాహలం. పండుగ వేళ ఇళ్ల ముందుకు గంగిరెద్దులు వచ్చి విన్యాసాలు చేస్తుంటాయి. దీంతో, అవి చేసే సందడికి వాటికి ఎంతో కొంత నగదు ఇస్తుంటారు ప్రజలు. కానీ, ఒకప్పుడు గంగిరెద్దులు వేరు ఇప్పుడు గంగిరెద్దులు వేరు. పండుగ వేళ ఇళ్ల ముందుకు స్మార్ట్ గంగారెద్దులు వస్తున్నాయి. గంగిరెద్దు తలకు క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. తాజాగా, దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. స్మార్ట్ గంగిరెద్దు...టెక్నాలజీని బాగా వాడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story