- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Happiness: హ్యాపీనెస్ కోల్పోయారా? .. ఆలోచించే తీరునుబట్టే అలా జరుగుతుందట!
దిశ, ఫీచర్స్ : ఏది కోల్పోయినా పెద్దగా ఎఫెక్ట్ అనిపించదు కానీ.. హ్యాపీనెస్ కోల్పోతే మాత్రం జీవితం అంధకారంగా మారుతుందంటారు పెద్దలు. మానసిక నిపుణులు, ఆధ్యాత్మిక వేత్తలు అదే చెప్తుంటారు. మీరు ఆనందంగా ఉండగలిగినప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుందని వైద్య నిపుణులు కూడా అంటుంటారు. ప్రతీ వ్యక్తికి బాధలు, సంతోషాలు కామన్. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, సమస్యలను ఎదుర్కొంటూనే వీలైనంత ఎక్కువగా ఆనందాన్ని ఆస్వాదించగలగాలి. అప్పుడే లైఫ్ బాగుంటుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అంతేకాని ‘నాకెప్పుడూ కష్టాలే.. నాకే ఎందుకిలా జరుగుతుందో’ అంటూ తరచూ నెగెటివ్ ఫీలింగ్స్‌తో గడిపేవారు నిజంగానే ఆనందాన్ని కోల్పోతారు. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుంటారు.
హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు దీనికి అర్థం ఏమిటి? అని ఆలోచిస్తూ కూర్చుంటే జీవితమే గడిచిపోతుంది తప్ప సమాధానం దొరకకపోవచ్చు. ఎందుకంటే హ్యాపీనెస్ బజార్లో దొరికే సరుకు కాదు. ఎవరో మనకు ఇవ్వాల్సిన వస్తువు అస్సలే కాదు. అది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఎవరికి వారు ఫీలయ్యే తీరును బట్టి అది హృదయాంతరంగంలోంచి పెల్లుబుకుతుంది. అంతేగానీ మనం ఆనందంగా ఉండకపోవడానికి ఇతరులు కారణమని ఎవరైనా అనుకుంటే పొరపాటే. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలను మనం స్వీకరించే తీరును బట్టి హ్యాపీనెస్ ఆధారపడి ఉంటుంది. మానసిక నిపుణుల ప్రకారం.. జీవితాన్ని మీరు స్వీకరించే విధానాన్ని బట్టి ఉంటుది. ప్రతీ విషయాన్ని నెగెటివ్ కోణంలో ఆలోచిస్తే లైఫ్ కూడా నెగెటివ్‌గానే కొనసాగుతుంది. అలాగే ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించగలిగితే లైఫ్ జీవితం కూడా పాజిటివ్ వే లో కొనసాగుతుంది. చాలా సందర్భాల్లో ఆనందంగా ఉండటం అనేది భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భావోద్వేగాల్లో ఏది ప్రతికూలమైందో, ఏది సానుకూలమైందో అర్థం చేసుకోగలగాలి. కొన్ని సందర్భాల్లో ప్రతికూల భావోద్వేగాలు ఎదురైనా తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే మీరు హ్యాపీనెస్‌కు దగ్గరయ్యే అవకాశం దొరుకుతుంది. ప్రతికూల పరిస్థితులు శాశ్వతంగా ఉండవు. ప్రయత్నించే క్రమంలో వాటిని తరిమికొట్టే మార్గమేంటో మీకే తెలుస్తుంది. ‘‘ఒక దారి మూసుకుపోయినప్పుడు మరో దారిలో వెళ్లండి. అసలు దారులన్నీ మూసుకుపోతే గనుక మీరే కొత్త దారిని క్రియేట్ చేయండి’’ అంటున్నారు మానసిక నిపుణులు. హ్యాపీనెస్ కోల్పోయామని భావించే వారు ఈ కొటేషన్‌ను అప్లై చేసుగలిగితే జీవితమంతా ఆనందమయమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Read more: