రిలేషన్‌షిప్‌లో డిఫరెంట్ బిహేవియర్స్.. రీజన్ ఏంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-05-24 09:57:06.0  )
రిలేషన్‌షిప్‌లో డిఫరెంట్ బిహేవియర్స్.. రీజన్ ఏంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : రిలేషన్ షిప్‌లో కానీ, ఇతర మానవ సంబంధాల విషయంలో కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో తీరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తులందరూ డిఫరెంట్ అటాచ్‌మెంట్ స్టైల్స్‌ను కలిగి ఉంటారు. ఇలా ప్రవర్తించే విధానాన్ని లేదా మానసికంగా ప్రతిస్పందించే తీరును ‘అటాచ్‌మెంట్ స్టైల్స్’ గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి బాల్యంలో వివిధ పరిస్థితుల్లో డెవలప్ అయి, పెద్దయ్యాక కూడా ప్రభావితం చేస్తుంటాయని, అందుకే మనుషుల మధ్య సంబంధాలు విభిన్న కోణాల్లో వ్యక్తం అవుతుంటాయని ‘ది మూడ్ స్పేస్‌’లోని థెరపిస్ట్ మెహెక్ రోహిరా అంటున్నారు. ఇవి ఎక్కువగా రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పబడుతున్నప్పటికీ, ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్స్ వంటి ఇతర సంబంధాల్లోనూ ఈ మధ్య కనిపిస్తున్నాయని చెప్తున్నారు.

సెక్యూర్ అటాచ్ మెంట్ స్టైల్

బాల్యంలో పేరెంట్స్ లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా సంరక్షకులుగానే కాకుండా ఎమోషనల్లీ అటాచ్‌మెంట్ కలిగి ఉంటారు. ఇలాంటి సంబంధంలో (caregiver-child relationship) బిడ్డ సేఫ్‌ అండ్ కంఫర్టబుల్‌ అనుభూతిని కలిగి ఉండటంవల్ల ఈ అనుబంధ శైలి అభివృద్ధి చెందుతుంది. ఇది పిల్లలు, సంరక్షకుల మధ్య హెల్తీ రిలేషన్‌షిప్ ద్వారా వస్తుంది. పెద్దయ్యాక కూడా పిల్లల్లో ఇటువంటి సెక్యూర్ బిహేవియర్స్ ప్రతిబింబిస్తుంటాయి. ఈ అటాచ్‌మెంట్స్ స్టైల్‌ను కలిగి ఉన్న వ్యక్తులు లాంగ్ టెర్మ్ రిలేషన్ షిప్‌ను ఏర్పరచుకోగలుగుతారు. తమ భాగస్వాములపట్ల నమ్మకంతో ఉంటారు. భావోద్వేగాలను సులభంగా వ్యక్తీకరించడం, కంట్రోల్ చేసుకోవడం వీరికి బాగా తెలుసు. అలాగే తమ సన్నిహిత సంబంధాలను అభినందిస్తారు. భాగస్వామిపై ఆధారపడటం, వారి మనస్సులో మంచి వ్యక్తులుగా స్పేస్ కలిగి ఉండటం వీరి ప్రత్యేకత. గుడ్ కమ్యూనికేటర్స్‌గా, మిత భాషులుగా ఉంటారు. ఓన్ బిహేవియర్ రెఫ్లెక్ట్స్‌ను, ఆత్మాభినాన్ని (self-esteem), హుందా తనాన్ని కలిగి ఉంటారు.

యాంగ్జైస్ అటాచ్‌మెంట్ స్టైల్

సంరక్షకులు వారి బిహేవియర్స్‌కు భిన్నంగా ఉన్నప్పుడు, కొన్ని సమయాల్లో శ్రద్ధగా ఉండటం, మరికొన్ని సందర్భాల్లో నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉండటం, పిల్లల అవసరాలకు అనుగుణంగా లేనప్పుడు ఈ అనుబంధ శైలి అభివృద్ధి చెందుతుంది. దీనిని ఎదుర్కొన్న పిల్లలు ఎదిగిన తర్వాత ఇన్ సెక్యూర్ ఫీలింగ్స్ (insecure feeling) ప్రదర్శిస్తుంటారు. అంతేగాక ఓవర్ సెన్సిటివిటీ, తమ సన్నిహిత వ్యక్తులను విడిచి ఉండలేకపోవడం వంటి ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ యాంగ్జైస్ (ఆత్రుత) అటాచ్‌మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు క్లోజ్ రిలేషన్ షిప్స్ ఏర్పరచుకోవడానికి వెనుకాడతారు. తమ అభిప్రాయాలను, సెంటిమెంట్స్‌ను ఇతరులతో పరస్పరం పంచుకోవడానికి భయపడతారు. ఒక విధమైన అభద్రతా భావం కలిగి ఉంటారు. నిరంతరం తమ పార్టనర్ దూరమైపోతున్నారనే సంకేతాల కోసం వెతుకుతూ ఉంటారు. విడిపోవడంపట్ల స్ట్రాంగ్ ఫియర్‌నెస్‌ను ప్రదర్శిస్తారు. వీరు ఇతరులతో కలిసి ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. తమకు ఎప్పుడూ ఎవరో ఒకరు భరోసా ఇస్తూ ఉండాలని భావిస్తారు. ఎందుకంటే వీరు తిరస్కరణ(rejection) సంకేతాలకు సెన్సిటివ్‌గా ఉంటారు. తమ గురించి తాము నెగెటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారు.

అవైడెంట్ అటాచ్ మెంట్ స్టైల్

బాల్యంలో పేరెంట్స్ లేదా సంరక్షకులు మానసికంగా అందుబాటులో లేనప్పుడు. వారికి దూరంగా ఉంటూ పిల్లలు పెరిగినప్పుడు ఈ విధమైన అటాచ్ మెంట్‌ స్టైల్ డెవలప్ అవుతుంది. వీరు చిన్నప్పుడు సంరక్షుల ద్వారా తిరస్కరించబడి ఉండటమో, లేదా వీరి అవసరాలకు పెద్దలు ప్రతిస్పందించడంలో ఎక్కువగా నిర్లక్ష్యం చేయడమో జరిగి ఉంటుంది. ఫలితంగా తమను తాము రక్షించుకోవవాలన్న బలమైన ఫీలింగ్‌తో ఎదుగుతారు. స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటారు. ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉంటారు. సమాజం నుంచి చాలా విషయాలను నేర్చుకుంటారు. వీరు పెద్దయ్యాక ఇతరులతో సాన్నిహిత్యాన్ని, సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. స్వీయ అభిమానాన్ని (self-sufficient) కలిగి ఉంటారు. ఇతరులతో రిలేషన్ షిప్స్‌లో డిస్టెన్స్ మెయింటెన్ చేయడానికి, ఎమోషనల్ అటాచ్ మెంట్స్‌ను దూరం చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పైగా ఇతరులను ఎక్కువగా నమ్మనరు. భావవ్యక్తీకరణ లేని ‘ఒంటరి తోడేళ్ళు‘గా(lone wolves) విమర్శలు ఎదుర్కొంటారు. ఇలాంటి వ్యక్తులు ఎమోషనల్ క్లోజ్ నెస్ ద్వారా అసౌకర్యంగా ఫీలవుతుంటారు. తరచుగా తమ భావోద్వేగ అవసరాలను తాము తీర్చగలమనే నమ్మకంతో ఉంటారు.

డిజార్గనైజ్ అటాచ్మెంట్ స్టైల్

మనసులో నాటుకుపోయిన చిన్ననాటి గాయం తరహా భావాలు కలిగి ఉంటారు. తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం లేదా దుర్వినియోగం అనుభవించినప్పుడు ఇది డెవలప్ అవుతుంది. వీరి చిన్నప్పుడు తమ సంరక్షకుని ప్రవర్తనలో అస్థిరత ఉండవచ్చు. దీంతో వీరు కన్ఫర్ట్ సోర్సెస్ కోల్పోతారు. తీవ్ర భయాన్ని కలిగి ఉంటారు. అనూహ్య చర్యల కారణంగా సంరక్షకులతో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకోవడానికి కష్టపడుతుంటారు. పెద్దలు వీరిని అర్థం చేసుకోకుండా ఉండటంవల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు పెద్దయ్యాక ఇతరులతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఎదుటి వారు తమను విడిచిపెడతారేమోనని భయపడుతుంటారు. ఈ కారణంగా వీరి రిలేషన్ షిప్‌లో అడ్డంకులు ఏర్పడతాయి. ఒక వైపు సాన్నిహిత్యం కోసం ఆరాట పడతారు. మరోవైపు అపనమ్మకం కారణంగా దానిని వదిలించుకోవాలని కూడా భావిస్తుంటారు. తమ రిలేషన్ షిప్‌లో అభద్రత, అస్థిరత యొక్క బలమైన భావాన్ని ప్రదర్శిస్తారు. భావోద్వేగాలను మేనేజ్ చేయడంలో, వ్యక్తీకరించడంలో ఇబ్బందిని, తక్కువ స్థాయి ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. తరచుగా ఎక్స్ ట్రీమ్ క్లోజ్‌నెస్ లేదా విపరీతమైన నిర్లిప్తత (extreme detachment) కోసం చూస్తారు.

పరిస్థితుల ప్రభావం

వ్యక్తుల్లో డిఫరెంట్ అటాచ్‌మెంట్ స్టైల్స్ ఉండటం తప్పుకాదు, ఎందుకంటే బాల్యం, పుట్టుక అందరికీ ఒకే విధమైన పరిస్థితులను కలిగి ఉండదు. ఒక్కో వ్యక్తి బ్యాగ్రౌండ్ ఒక్కోలా ఉంటుంది. చిన్నప్పుడు సంరక్షుల ద్వారా, వనరుల ద్వారా, తమకున్న పరిస్థితుల ద్వారా, అవకాశాల ద్వారా వ్యక్తులు ప్రభావితం అవుతారు. బాల్యంలోని అనుభవం, అవగాహనవల్ల ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకమైన ప్రవర్తన లేదా వ్యక్తిత్వం ఏర్పడవచ్చు. పెద్దయ్యాక అవి ప్రభావితం చేస్తాయి. చదువుకోవడం, సమాజాన్ని, వ్యక్తులను అబ్జర్వ్ చేయడం, సమాజం నుంచి నేర్చుకోవడం వంటి చర్యల ద్వారా సహజంగానే మనుషులు జ్ఞానాన్ని పొందుతారు. చాలామంది తమలోపాలను సరిదిద్దుకొని, అందరికీ అనువైన గుడ్ బిహేవియర్‌ను అలవర్చుకుంటారు. ఇక సమాజంతో ఎక్కువగా అటాచ్ మెంట్‌లేని వ్యక్తులు ఆలస్యంగా తమ లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అరుదుగా కొందరికి మానసిక నిపుణుల కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. అయినప్పటికీ ఒక్కో వ్యక్తి తనకు తాను ప్రత్యేక శైలిని కలిగి ఉంటాడు. అయితే ప్రతీ వ్యక్తి తనవల్ల ఎవరికీ ఇబ్బందిలేకుండా, తనను తాము మల్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి.

Read More: ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్.. మనుషుల్లో పెయిన్ రిలేటెడ్ ఫీలింగ్స్‌కు ఇదే కారణం!

Advertisement

Next Story

Most Viewed