మందుకు బానిసైపోయారా..? ఈ ట్యాబ్లెట్‌తో బయటపడొచ్చు!

by Vinod kumar |
మందుకు బానిసైపోయారా..? ఈ ట్యాబ్లెట్‌తో బయటపడొచ్చు!
X

దిశ, ఫీచర్స్: అసంఖ్యాకమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, చివరికి మరణానికి కారణం అవుతోంది మద్యపానం. ఈ సంక్లిష్టమైన మానసిక వ్యాధి, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ (AUD)‌ను ట్రీట్ చేసేందుకు 'disulfiram (Antabuse)', 'naltrexone' మందులను మాత్రమే ఎఫ్‌డీఏ ఆమోదించింది. అయితే సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలవని కొత్త అధ్యయనం కనుగొంది. ఇందుకోసం గత అధ్యయనాల పై ఆధారపడింది.


ఒక నిర్దిష్ట వ్యాధికి సంబంధించిన జన్యువులను గుర్తించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడే జీనోమ్-వైడ్ అసోసియేషన్ అధ్యయనాలు, ఎంజైమ్ ఫాస్ఫోడీస్టేరేస్-4 (PDE4).. ముఖ్యంగా సబ్‌టైప్ PDE4b, ఆల్కహాల్, నికోటిన్ డిపెండెన్స్ మధ్య సంబంధాన్ని సూచించాయి. PDE4 సైక్లిక్ అడెనోసిన్ మోనోఫాస్ఫేట్ (cAMP) క్షీణతకు కారణమవుతుంది.

ఇది ఇన్‌ఫ్లమేటరీ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కణాంతర అణువు. PDE4 ద్వారా cAMP అధోకరణాన్ని నిరోధించడం ప్రయోజనాన్ని కలిగి ఉన్నట్లు చూపబడింది. అటువంటి PDE4 నిరోధకం, సోరియాసిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అయిన అప్రెమిలాస్ట్ (ఓటెజ్లా) ప్రత్యేకంగా నిలిచింది. పరిశోధకులు ఈ ఔషధం సామర్థ్యాన్ని ఎలుకలపై పరీక్షించగా సక్సెస్ అయింది.

Advertisement

Next Story

Most Viewed