ప్రపోజ్ డే.. మీ ప్రేమను ఇలా తెలిపితే.. ఎవ్వరైనా పడిపోవాల్సిందే!

by Jakkula Samataha |
ప్రపోజ్ డే.. మీ ప్రేమను ఇలా తెలిపితే.. ఎవ్వరైనా పడిపోవాల్సిందే!
X

దిశ,ఫీచర్స్ : ఐలవ్ యూ.. ఐలవ్ యూ ఓ మల్లిక, ఐలవ్ యూ.. ఐలవ్ యూ.. అనే పాట అందరికీ తెలిసిందే. అయినా ఈ పాట ఏంటీ? లవ్ ఏంటీ అనుకుంటున్నారా? అదేనండి ఈరోజు ప్రపోజ్ డే. వాలెటైన్ వీక్‌లో నేడు రెండో రోజును ప్రేమికులు, ప్రపోజ్ డేగా చేసుకుంటారు. ఇక ప్రేమ గురించి ఎంత పొగిడినా.. ఎంత చెప్పినా తక్కువే. తన ప్రేమను తెలపడానికి ఏకంగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మించాడంటే? ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రేమను పరిచయం చేస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి.

ఇక లవ్ అనేది ఎవరైనా చేస్తారు కానీ ఆ ప్రేమను మనం ఇష్టపడిన అమ్మాయితో చెప్పడమే గొప్ప అంటుంటారు. తమ ప్రేమను చెప్పలేక ఎంతో మంది, తాము ఇష్టపడిన వారిని దూరం చేసుకుంటారు.కాగా, ఎలాంటి భయం లేకుండా.. ప్రపోజ్ డే రోజు మీ గుండెల్లో ఇన్ని రోజులుగా దాచుకున్న ఆ తీపి జ్ఞాపకాలను కొటేషన్స్‌గా మార్చుకుంటూ మీ ప్రేమను ఇలా వ్యక్తపరచండి. మీ లవర్ మీ ప్రేమను ఒకే చేయడం ఖాయం.

మీ ప్రేమను ఈరోజు ఇలా తెలిపి, సంతోషాన్ని వ్యక్తం చేయండి

1.నా జీవితంలో ఉన్న చీకటిలో కనిపించిన వెలుగువు నువ్వు. నిన్ను మించిన విలువైనది నా జీవితంలో ఏదీ లేదు. మనసులోతుల్లో నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వే నా ప్రపంచం. ఐ లవ్ యూ

2. చిరునవ్వుల వరమిస్తావా..చితినుండి లేచివస్తా..

మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తా..

3. గులాబీ పువ్వు ఇచ్చి ఐలవ్‌యూ చెప్పడం నాకు రాదు.. నాకు తెలిసిందల్లా ఒక్కటే నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకోవడం.. ఐలవ్ యూ బంగారం

4.ఎవరి మనసులో నీ ఉన్నావో నాకు తెలియదు కానీ నా మనసుకు దగ్గరైనా ఒకే ఒక మనిషివి నువ్వే..

5.నువ్వు నా హృదయాన్ని దోచుకున్నావు. దాన్ని మళ్లీ నాకు తిరిగి ఇవ్వద్దు. నీదగ్గరే జీవితాంతం ఉంచేయాలనుకుంది. నన్ను పెళ్లి చేసుకుని… నా గుండెను నీ దగ్గర ఉంచేసుకో.

6.నీ కళ్ళలో… నా ప్రేమ, నా భవిష్యత్తును చూసుకున్నాను. నీతో పాటూ జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను సృష్టించాలనుంది. నువ్వు నా జీవిత భాగస్వామి అవుతావా?

Advertisement

Next Story

Most Viewed