Princess Diana: నేనే ప్రిన్సెస్ డయానా.. మళ్లీ పుట్టాను.. రాయల్ ఫ్యామిలీ గురించి పూసగుచ్చినట్లు చెప్పిన పిల్లాడు..

by Sujitha Rachapalli |
Princess Diana: నేనే ప్రిన్సెస్ డయానా.. మళ్లీ పుట్టాను.. రాయల్ ఫ్యామిలీ గురించి పూసగుచ్చినట్లు చెప్పిన పిల్లాడు..
X

దిశ, ఫీచర్స్ : ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టింది. అవును.. ఎనిమిదేళ్ల కుర్రాడు తనే యువరాణిని అని గత జన్మకు సంబంధించిన విషయాలను పూస గుచ్చినట్లుగా చెప్పాడు.బ్రిటన్ రాయల్ విల్లాస్, తను కారు ప్రమాదంలో చనిపోయిన అన్ని అంశాల గురించి వివరించాడు. దీంతో కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచానికి స్పెషల్ ఇంట్రెస్ట్ టాపిక్ అయిన ప్రిన్సెస్ డయానా ఇప్పుడు కూడా మరోసారి ఆసక్తికరంగా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే ఆస్ట్రేలియా టెలివిజన్ పర్సనాలిటీ డేవిడ్ క్యాంప్‌బెల్ చిన్నకొడుకు బిల్లీ క్యాంప్‌బెల్ చెప్పే అసాధారణ విషయాల గురించి 2019లో తొలిసారి పంచుకున్నాడు. ఆయన ప్రకారం.. రెండేళ్ల నుంచే తాను ప్రిన్సెస్ డయానా అని చెప్పడం స్టార్ట్ చేశాడు కొడుకు. ప్లేస్,ఈవెంట్స్‌తో సహా అన్నీ చెప్పినా ముందు లైట్ తీసుకున్నారు. కానీ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ స్కాటిష్ రెసిడెన్స్ బల్మోరల్ కాజిల్ గురించి పిన్ టు పిన్ వివరించేసరికి స్టన్ అయ్యారు.తన చిన్నప్పుడే తోబుట్టువు జాన్ స్పెన్సర్ చనిపోయాడని, పారిస్‌లో జరిగిన కారు ప్రమాదం గురించి పూర్తిగా వివరించగా.. కొద్దిగా నమ్మడం స్టార్ట్ చేశారు. ఒకరోజు డయానా ఫొటో చూపించి తనెవరని అడగ్గా.. ‘అది నేనే ప్రిన్సెస్ డయానాగా ఉన్నా. కానీ ఒకరోజు సైరెన్స్ మోగాయి. ఇకపై నేను యువరాణిగా ఉండనని చెప్పాయి’ అని చెప్పుకొచ్చాడని తెలిపారు. ఇవన్నీ విన్నాక గత జన్మ స్మృతులేమోనని నమ్మాల్సి వచ్చిందని తల్లిదండ్రులుగా మీడియా ముందుకొచ్చినట్లు తెలిపారు.

అయితే దీనిపై నిపుణులు కూడా తమ వాదనలు వినిపించారు. ప్రిన్సెస్ డయానా గురించి పేరెంట్స్ మాట్లాడుకునే మాటలు, మీడియా కథనాలు విని..తనకు యాప్ట్ చేసుకుని ఉంటాడని అన్నారు. కానీ తామెప్పుడూ పిల్లల ముందు ప్రిన్సెస్ ప్రస్తావనే తేలేదని చెప్పారు తల్లిదండ్రులు. అయితే మరికొందరు మాత్రం గత జన్మ స్మృతులు అయ్యుండొచ్చని వాదించారు. అయితే ప్రస్తుతం ఆ పిల్లాడి వయసు తొమ్మిదేళ్లు కాగా ఇలాంటి విషయాల గురించి తానెప్పుడు మాట్లాడినట్లు గుర్తేలేదని అనడం విశేషం.

Advertisement

Next Story