Pregnent Womens: గర్భిణీలు కీరదోసకాయలు తినొచ్చా?

by Prasanna |
Pregnent Womens: గర్భిణీలు కీరదోసకాయలు తినొచ్చా?
X

దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలం వస్తుందనగానే అందరికి ముందు గుర్తొచ్చేది పుచ్చకాయ, కీరదోస. ఎందుకంటే వీటిలో 96 శాతం నీరు ఉంటుంది. అయితే ఈ కీరదోసను అందరూ తినొచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటుంది. కీరదోసలో విటమిన్ కె, విటమిన్ సి, జింక్, పొటాషియం,కాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఉంటాయి.వీటిని తీసుకోవడం వలన పిండం పెరుగుదలకు సహాయపడతాయి. సాధారణ మనుషులు ఎవరైనా దీన్ని తినవచ్చు. గర్భిణీలు తినొచ్చా లేదనేది ఇక్కడ చూద్దాం.

గర్భిణీలు చిన్న దానికే కంగారు పడుతుంటారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి.. మానసిక స్థితిని మెరుగుపరచడానికి వీటిని తింటూ ఉండండి. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయి. గర్భధారణ సమయంలో రక్తపోటు సరిగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారట. ఇక్కడ మనం తెలుసుకోవాలిసిన ముఖ్య విషయం ఏంటంటే.. దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఎలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కాబట్టి లిమిట్‌గానే తీసుకోండి.

Advertisement

Next Story

Most Viewed