Smart phone : మొబైల్ స్క్రీన్‌కు మన కళ్ళను ఎందుకు దగ్గరగా ఉంచకూడదు?

by Jakkula Samataha |   ( Updated:2024-07-24 15:53:56.0  )
Smart phone : మొబైల్ స్క్రీన్‌కు మన కళ్ళను ఎందుకు దగ్గరగా ఉంచకూడదు?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌కు అడెక్ట్ అయిపోయారు. అయితే దీంతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి అంతే కాకుండా, విరివిగా స్మార్ట్ ఫోన్ వాడటం వలన అనారోగ్య సమస్యలు కూడా దరిచేరుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్ ఎక్కువ సేపు వాడటం లేదా, మొబైల్ స్క్రీన్ మన కంటికి దగ్గరగా పెట్టుకొని వాడటం వలన అది కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంట. అందుకే స్మార్ట్ ఫోన్‌ను కంటికి దగ్గరగా పెట్టుకొని వాడకూడదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కాగా, అసలు స్మార్ట్ ఫోన్ మన కంటికి దగ్గరగా పెట్టుకొని వాడటం వలన ఎలాంటి సమస్యలు ఎదురు అవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్‌ను మన కంటికి దగ్గరగా పెట్టుకొని, గేమ్ ఆడటం లేదా చాటింగ్ చేయడం లాంటివి చేయకూడదంట. కొన్ని గంటల పాటు మనం ఫోన్‌ను మనకు తెలియకుండా చాలా దగ్గరగా పెట్టుకొని చూస్తుంటాం. దీని వలన మన కళ్ళు, రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుందంట. దీని వలన కొందరికి సైట్ , కళ్ళు అస్పష్టంగా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా, స్మార్ట్ ఫోన్ అధికంగా వాడటం వలన కొన్ని సార్లు విపరీతమైన తలనొప్పి, కళ్ళలో నుంచి నీరు, దురద పొడిబారటం వంటి సమస్యలు ఏర్పడుతాయంట. అందుకే వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను చాలా దూరం నుంచి వాడలంట.

స్మార్ట్ ఫోన్ వాడే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను రోజులో చాలా తక్కువ సమయం మాత్రమే వాడాలి.

‌ఫోన్ కంటిన్యూగా వాడే క్రమంలో తప్పకుండా కళ్లను బ్లింక్ చేస్తూ స్మార్ట్ ఫోన్ వాడాలంట.

స్మార్ట్ ఫోన్‌కు మన కళ్లు సుమారు 8 అంగుళాల దూరంలో ఉంచాలి.

స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, సిస్టమ్ స్క్రీన్ ఎక్కువ సేపు వాడాల్సి వస్తే తప్పకుండా 20 నిమిషాలకు ఒకసారి, ఇరవై సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలంట. దీని వలన కళ్లపై ఒత్తిడి పడదు.

స్మార్ట్ ఫోన్ వాడే సమయంలో కళ్ల జోడు వాడకం కూడా మంచిదే.

(నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)


Read more...

Insomnia: పిల్లల్లోనూ నిద్రలేమి.. ‘డిజిటల్ ఏజ్’ ఎఫెక్టే కారణమా?

Advertisement

Next Story

Most Viewed