Precautions : వాక్సింగ్ తర్వాత ఇలా చేస్తున్నారా.. చర్మం పాడైపోవచ్చు జాగ్రత్త..

by Sumithra |
Precautions : వాక్సింగ్ తర్వాత ఇలా చేస్తున్నారా.. చర్మం పాడైపోవచ్చు జాగ్రత్త..
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వ్యాక్సింగ్ చేయించుకుంటున్నారు. ఇది చర్మం నుంచి అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. అలాగే చనిపోయిన చర్మాన్ని కూడా తొలగిస్తుంది. దీని కారణంగా చర్మం తాకడానికి చాలా మృదువుగా అనిపిస్తుంది. కానీ వాక్సింగ్ తర్వాత చాలా సార్లు చర్మం పై ఎరుపును గమనించి నొప్పిని అనుభవిస్తారు ప్రజలు. వ్యాక్సింగ్ ద్వారా మొటిమలు, దద్దుర్లు, వాపులు మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. అసలైన వ్యాక్సింగ్ అనేది వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత, అవాంచిత రోమాలను స్ట్రిప్‌తో లాగి తొలగిస్తారు. తద్వారా జుట్టు లోపలి నుంచి తొలగిపోతుంది. దాంతో చర్మం మృదువుగా, అందంగా నిగనిగలాడుతూ చాలా సున్నితంగా మారుతుంది. ఈ వ్యాక్సింగ్ తర్వాత చర్మం అలాగే అందంగా ఉండాలంటే అనేక సంరక్షణ నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది.

వ్యాక్సింగ్ తర్వాత చర్మం పై దద్దుర్లు, ఎరుపు, దురద ఉంటే, దాని వెనుక కారణం సరైన ఉత్పత్తిని ఉపయోగించకపోవడమే అని చెబుతారు. అలాగే కొందరు వ్యక్తులు చర్మ సంరక్షణలో పొరపాట్లు చేయడం వల్ల చర్మం చికాకు, ఇతర సమస్యలకు గురవుతుందంటున్నారు. మరి వ్యాక్సింగ్ తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లీచ్ చేయవద్దు..

ప్రజలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ఫేస్ వ్యాక్స్ చేసుకుంటుంటారు. కానీ ముఖం వ్యాక్స్ చేసిన తర్వాత పొరపాటున కూడా బ్లీచ్ చేయకూడదంటున్నారు నిపుణులు. లేకుంటే చర్మం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ఎందుకంటే బ్లీచ్‌లో రసాయనాలు ఉంటాయి. దీని ప్రతిచర్య చర్మం పై ఉంటుంది. దీంతో చర్మం పై ఎరుపు, వాపు మొదలైనవి ఉండవచ్చు.

సబ్బు వాడటం మానుకోవాలి..

వ్యాక్సింగ్ చేస్తే, కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు చర్మం పై సబ్బు, ఫేస్ వాష్ మొదలైన వాటిని ఉపయోగించకుండా ఉండండి. ఇది మీ చర్మం పై దురద, ఎరుపు సమస్యను కూడా పెంచుతుంది.

ఎండలో వెళ్లకూడదు..

వాక్సింగ్ తర్వాత కొన్ని గంటలపాటు బలమైన సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త వహించండి. అంతే కాకుండా వేడి ఎక్కువగా ఉన్న చోట ఏ పని చేయకూడదు. ఇది మీ చర్మం పై దద్దుర్లు, చికాకు మొదలైన వాటికి కారణం కావచ్చు. వ్యాక్సింగ్ తర్వాత కనీసం 24 గంటల పాటు వేడి నీటితో స్నానం చేయకుండా ఉండాలి.

వ్యాక్సింగ్ తర్వాత..

వ్యాక్సింగ్ పూర్తయిన తరువాత చర్మం పై మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. అంతే కాదు మీరు అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చల్లదనాన్ని కూడా అందిస్తుంది. చర్మంపై దద్దుర్లు, ఎరుపు నుంచి కూడా రక్షణ ఉంటుంది.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story