- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Beauty Tips: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? బంగాళదుంపతో శాస్వత పరిష్కారం.. ఎలాగంటే?
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో సతమతమతున్నారు. పూర్వం 40 ఏళ్లు పైబడిన వారికే వచ్చే ఈ తెల్ల జుట్టు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వెంటాడుతోంది. స్కూల్‌కు, కాలేజీలకు వెళ్లే వయస్సులోనే వైట్ హెయిర్ రావడంతో ఇబ్బంది పడటమే కాకుండా.. వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా తగ్గుపోతున్నాయి. దీంతో తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు అనేక రకాల షాంపూలు, హెయిర్ కలర్స్ వాడుతున్నారు. అయితే.. ఇందులో కొన్ని ఎక్కువ కెమికల్స్‌తో తయారు కావడంతో జుట్టు రాలిపోతుంది. మరి జుట్టు రాలకుండా.. తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఇంట్లోనే ఉండే బంగాళదుంప అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగాళదుంప తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. బంగాళదుంప తొక్కల నుంచి తీసిన నీటిలో మెగ్నీషియం, పొటాషియం, నియాసిస్, కాల్షియం, రాగి, జింక్, ఐరన్ వంటివి జుల్టు రాలకుండా ఉంచడంతో పాటు.. తెల్ల జుట్టును నివారిస్తుందని చెబుతున్నారు.
దీని కోసం.. 5-6 పెద్ద బంగాళాదుంప తొక్కలను నీళ్లలో వేసి.. ఆ నీరు గంజిలా అయ్యేవరకు బాగా ఉడకబెట్టాలి. అనంతరం చల్లారిన నీటిని వడగట్టి తొక్కలు తీసేసి లిక్విడ్‌ని వెరొక బౌల్‌లోకి తీసుకోండి. హెయిర్ వాష్ చేసి, కండిషన్ చేసిన తర్వాత ఈ లిక్విడ్‌ని తలకు బాగా అప్లై చేయాలి. ఒక అరగంట పాటు అలాగే వదిలేసిన తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే.. జుట్టుకి పిగ్మెంటేషన్‌ని ఇస్తుంది. దీంతో తెల్లజుట్టు నల్లబడడమే కాకుండా వైట్ హెయిర్ తిరిగి రాకుండా ఉంటుంది. అంతే కాకుండా హెయిర్ ఫాల్ సమస్యను కూడా నివారిస్తుంది.