మొసలి నుంచి కుటుంబాన్ని కాపాడిన కుక్క.. బెదిరించి పరుగెత్తించింది.. వీడియో వైరల్

by Dishafeatures3 |
మొసలి నుంచి కుటుంబాన్ని కాపాడిన కుక్క.. బెదిరించి పరుగెత్తించింది.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: మొసలిని చూస్తేనే భయంతో పరుగులు తీస్తుంటాం. దాని నోటికి దొరికితే అంతే సంగతి అనే భయం జంతువులను కూడా వెంటాడుతుంది. అందుకే మొసళ్లు తిరిగే చోటుకు దాదాపు వెళ్ళకుండానే జీవిస్తాయి. ఇక మనం అయితే తప్పనిసరి పరిస్థితులో వెళ్లాల్సి వచ్చినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఈ కుక్క మాత్రం మొసలినే భయపెట్టింది. మరోసారి వస్తే మంచిగుండదనే వార్నింగ్ ఇచ్చినట్లు కూడా అనిపిస్తుంది నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే.

విషయం ఏంటంటే.. ఫ్లోరిడాలోని ఓ ఇల్లును సరస్సు పక్కనే కట్టుకున్నారు. ప్రకృతిని ఆస్వాదించాలని అనుకున్నారు. కానీ ఓ మొసలి కొత్తగా ఆ సరస్సులోకి రావడం, ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. అలా వస్తున్న మొసలిని చూసి ఇంటి ఓనర్ భయంతో తలుపు చాటున దాక్కుంటే.. పెంచుకున్న కుక్క మాత్రం విశ్వాసంతో అరవడం మొదలుపెట్టింది. గట్టిగా మొరగడంతో భయపడిపోయిన ఆ మొసలి అక్కడి నుంచి వేగంగా వెనక్కి పరుగెత్తుకుని పోయింది. ఈ సంఘటనను ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సంపాదించుకుంది. దాదాపు నాలుగు లక్షల లైక్స్ తో ట్రెండ్ అవుతుంది.



Next Story

Most Viewed