రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్ అంటే ఏంటో తెలుసా..?

by Dishafeatures1 |
రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్ అంటే ఏంటో తెలుసా..?
X

దిశ,ఫీచర్స్: దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ వాతావరణాన్ని హెచ్చరించేందుకు ప్రత్యేకంగా రంగు ఆధారంగా జారీ చేయబడతాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ).. ప్రజలు, అధికారులకు సూచనలు ఇస్తోంది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు ఆరెంజ్​ అలర్ట్​ ఇస్తుంటే.. ఇంకొన్ని ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేస్తోంది. అసలేంటి ఈ ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​? మనం ఇక్కడ తెలుసుకుందాము..

గ్రీన్​ అలర్ట్​:- వాతావరణానికి సంబంధించిన అప్డేట్​ ఉండి, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పుడు ఇచ్చేదే ‘గ్రీన్​ అలర్ట్’​.

యెల్లో అలర్ట్​:- వాతావరణం ప్రతికూలంగా ఉండి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ అలర్ట్​ సూచిస్తుంది.

ఆరెంజ్​ అలర్ట్​:- వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉందని, విద్యుత్​, రైలు, రోడ్డు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఈ అలర్ట్​ అమల్లోకి వస్తుంది.

రెడ్​ అలర్ట్​:- చివరిది రెడ్​ అలర్ట్​. పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నప్పుడు, ప్రజల జీవితాలను ముప్పు పొంచి ఉందని సూచించేందుకు ఈ అలర్ట్​ జారీ అవుతుంది.

Next Story

Most Viewed