Farmers : ఈ పురుగుల మందులు వాడొద్దు.. రైతులకు హెచ్చరిక..

by Sujitha Rachapalli |
Farmers : ఈ పురుగుల మందులు వాడొద్దు.. రైతులకు హెచ్చరిక..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా పంట తెగుళ్ల నివారణకు రైతులు పురుగుల మందులు వాడుతారు. మొక్కలను రక్షించుకుంటారు. దిగుబడి పెంచుకుంటారు. అయితే ఈ పెస్టిసైడ్స్ వాడకం వల్ల ధూమపానం వల్ల కలిగే అనారోగ్యల కన్నా ఎక్కువ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అన్నదాతలకు లుకేమియా, మూత్రాశయ క్యాన్సర్, నాన్-హాడ్జికిన్స్ లింఫోమా వంటి రిస్క్ అధికంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఇండియాలో 69 పురుగుల మందులు అధిక క్యాన్సర్ రేటుతో ముడిపడి ఉన్నాయని చెప్పారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) కు సంబంధించిన 2015-2019 డేటాను ఉపయోగించిన పరిశోధకులు క్యాన్సర్ రేట్లను విశ్లేషించారు. పండించే పంటల రకాలను బట్టి క్యాన్సర్ ప్రమాదాలు మారుతున్నాయని కనుగొన్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ క్యాన్సర్ కంట్రోల్ అండ్ సొసైటీలో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో 2,4-D, ఎసిఫేట్, మెటోలాక్లోర్, మెథోమిల్ వంటి 69 రకాల పురుగుమందులు ఈ లిస్ట్ లో ఉన్నాయి. వీటిని సాధారణంగా భారతదేశంలో పంట తెగుళ్లు, కలుపు మొక్కల నుంచి రక్షించడానికి ఉపయోగిస్తారు. కాగా పురుగుమందుల వాడకం స్మోకింగ్ వల్ల కలిగే క్యాన్సర్ ప్రమాదంతో పోల్చిన మొదటి అధ్యయనం ఇదే. అయితే రైతులు ఒక్కటి కాకుండా మిక్స్డ్ పెస్టిసైడ్స్ కు గురవుతున్నారని తెలిపింది.

Advertisement

Next Story