Perfume : పెర్ఫ్యూమ్ నేరుగా ఎక్కడ అప్లయ్ చేయకూడదంటే..!

by Javid Pasha |
Perfume : పెర్ఫ్యూమ్ నేరుగా ఎక్కడ అప్లయ్ చేయకూడదంటే..!
X

దిశ, ఫీచర్స్ : సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్ వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే వీటి తయారీలో ఆల్కహాల్ సహా వివిధ రసాయనాలను వాడుతుంటారు. కాబట్టి వాటిని నేరుగా చర్మంపై అప్లై చేయడంవల్ల స్కిన్ అలెర్జీలు, వివిధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలా చేస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? పరిష్కారం ఏమిటో చూద్దాం.

* చర్మంపై నేరుగా పెర్ఫ్యూమ్ అప్లయ్ చేస్తే వివిధ రకాల ఇన్ ఫెక్షన్లు దాడిచేయవచ్చు. ఎందుకంటే వీటిలోని ఆల్కహాల్‌ స్వేద రంధ్రాల్లోకి చొరబడుతుంది. అది చర్మ వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. తేమను కూడా గ్రహించడం కారణంగా స్కిన్ డ్రై గా మారవచ్చు. అంతేకాకుండా పెర్ఫ్యూమ్ లోని న్యూరో టాక్సిన్ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

* క్రమం తప్పకుండా పెర్ఫ్యూమ్ ఉపయోగిస్తుంటే, ఒకవేళ అది చర్మానికి పడకపోతే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఇది సువాసనలలో ఉండే కెమికల్స్ వల్ల హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటుంది. చర్మ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. స్టైరిన్, థాలేట్స్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు పెర్ఫ్యూమ్స్‌లో ఉండటం కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పెర్ఫ్యూమ్స్ ముఖం, మెడ, ఛాతీ, నడుము, శరీరంలోని ఇతర సున్నితమైన ప్రాంతాల్లో అప్లయ్ చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed