- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'భార్య కోపంగా ఉంది.. వన్ వీక్ లీవ్ ఇవ్వండి సర్'.. కొత్తగా పెళ్లైన కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్..
దిశ, ఫీచర్స్ : 'సర్.. నా భార్య కోపంగా ఉంది. నా మేనల్లుడి పుట్టిన రోజునాడు ఇంటికి వస్తానని తనకు ప్రామిస్ చేశాను. నాకు ఏడు రోజులు లీవ్ ఇవ్వండి ప్లీజ్' అంటూ ఉత్తరప్రదేశ్, మహరాజ్ గంజ్‌కు చెందిన కానిస్టేబుల్ ఎస్పీకి పెట్టుకున్న లీవ్ లెటర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. హిందీలో ఉన్న లీవ్ లెటర్‌లోని విషయాలు అందరినీ అకట్టుకుంటున్నాయి. భావోద్వేగపూరితమైన లెటర్‌లో పి.ఆర్.వి. నౌతన్ వన్ అనే కానిస్టేబల్ వాస్తవిక సమస్యను ప్రస్తావించడంతో ప్రశంసలతో పాటు సానుభూతి పొందుతున్నాడు.
కొత్తగా పెళ్లయిన దంపతులు కొంతకాలం ఏకాంతంగా గడపాలనుకోవడం సహజమే. దురదృష్టవశాత్తు ఉద్యోగ జీవితం కారణంగా కొన్నిసార్లు అలాంటి సందర్భాలు, అనుభూతులు పొందలేకపోవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కానిస్టేబుల్.. 'గత నెలలోనే నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత భార్యతోపాటు ఇంటికి వచ్చి, మళ్లీ వెంటనే డ్యూటీకి వచ్చాను. అందుకే ఆమె కోపంగా ఉంది మాట్లాడటం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తల్లికి ఇస్తోంది కానీ తను మాత్రం మాట్లాడట్లేదు. ఇందుకు కారణం పెళ్లి తర్వాత లీవ్ తీసుకోకపోవడమే. అందుకే మేనల్లుడి పుట్టినరోజు నాడు ఇంటికి వస్తానని నా భార్యకు ప్రామిస్ చేశాను. ఇందుకోసం ఏడు రోజులు లీవ్ మంజూరు చేయాలని కోరుతున్నా. జనవరి 10 నుంచి లీవ్ ఇవ్వాల్సిందిగా విజ్జప్తి' అని లెటర్‌లో పేర్కొన్నాడు.
అయితే ఈ లీవ్ లెటర్‌ను చదివిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అతిష్ కుమార్ సింగ్ సదరు కానిస్టేబుల్‌కు 5 రోజులు లీవ్ మంజూరు చేశాడు. 'సదరు పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అవసరాలను బట్టి ఇతర పోలీసు ఆఫీసర్లు సెలవులో ఉంటుంటారు. అందుకే ఇలా జరిగింది. పోలీస్ వ్యవస్థలో లీవ్స్‌కు ఇబ్బందేమీ లేదు. కాకపోతే రొటేషన్ పద్ధతిలో ఇస్తుంటాం. శాంతి భద్రతల విషయం కాబట్టి డిపార్ట్‌మెంట్ పరంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ ప్రకారం లీవ్స్ ఇస్తుంటాం' అని వివరించాడు.
ఇవి కూడా చదవండి : మగాళ్లూ.. మీరు కూడా మనస్ఫూర్తిగా ఏడ్వండి.. మీ కన్నీళ్లు మీ ఇష్టం