- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రార్థనతో సన్నబడింది!! స్త్రీ నడుము సైజు తగ్గిందన్న పాస్టర్
దిశ, ఫీచర్స్ : యూఎస్‌లో ఓ పాస్టర్ చేసిన 'పవిత్ర లైపో సక్షన్' లైవ్ ప్రోగ్రామ్ మలయాళం ఫిల్మ్ 'ట్రాన్స్' మూవీని తలపించింది. క్రిస్మస్ టైమ్‌లో పాస్టర్ తన ప్రార్థన ద్వారా మహిళ నడుము సైజును కుదించేసిన వీడియో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో సదరు పాస్టర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిమ్‌లు, వ్యాయామాలు ఆపేసి జిమ్మిక్కులు చేసుకుని బతికేద్దాం అని సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్.
ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి హాజరైన భక్తులతో మాట్లాడుతున్న పాస్టర్.. అధిక బరువుగల మహిళను వేదికపైకి రావాలని పిలుస్తాడు. ధైర్యం, విశ్వాసం గల యువతులు ఉంటే తన అభ్యర్థనను మన్నించాలని కోరుతాడు. ఒక యువతి వెళ్లాలా వద్దా అన్నట్టు సందేహిస్తుంటే.. 'నువ్వు నిజమైన విశ్వాసివే కదా. దేవున్ని నిజంగా నమ్మేవారికి ఏదీ అసాధ్యం కాదు' అంటాడు. దీంతో వేదికపైకి వెళ్లిన ఆ యువతి చేతులు పైకి ఎత్తాలని సూచిస్తాడు. ఆమె నడుము సన్నబడుతుందో లేదో చూడటానికి మరో మహిళను కూడా వేదికపైకి రావాలని కోరుతాడు. అధిక బరువుగల, లావుగా ఉన్న మహిళ నడుమును సన్నబడేలా చేయాలని.. వెంటనే ఆమెలో మార్పు కనిపించాలని దేవుడిని ప్రార్థిస్తాడు. అయితే ఒక వ్యక్తి ఆమె నడుము సన్నబడలేదని కామెంట్ చేయగా పాస్టర్ స్పందిస్తూ.. 'ప్రస్తుతం సన్నబడింది. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రజలు ఆమెను గుర్తించలేనంతగా మరింత సన్నబడుతుంది. ఇది రియల్. ఛాలెంజ్' అనగానే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. అప్పుడు పాస్టర్ లావుగల మహిళ నడుములో మార్పు వచ్చిందో లేదో చూసి చెప్పాలని ఆమెకు తోడుగా పిలిచిన మరో యువతికి సూచిస్తాడు. దీంతో ఆమె సదరు మహిళ నడుము ముందుకంటే సన్నబడిందని, ఆమె ప్యాంట్ కూడా లూజ్ అయిందని చెప్తూ ప్యాంట్ లాగుతూ చూపెడుతుంది.
లాటిన్ ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన కొందరు పాస్టర్‌ను విమర్శిస్తుంటే.. మరి కొందరు ఫన్నీ కామెంట్స్, సెటైర్స్ వేస్తున్నారు. 'పాస్టర్ గారి ప్రార్థనతో సన్నబడితే ఇక జిమ్‌లు, ఎక్సర్‌సైజులు అవసరం లేదు' అని కామెంట్ చేశారు. ప్రజలను మోసం చేసే ఇలాంటి నాటకాలతో అద్భుతాలు సృష్టి్స్తున్నామని చెప్పడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.