ప్యారాచూట్ కొబ్బరి నూనె జుట్టుకు పెట్టుకునేది కాదా..?

by sudharani |   ( Updated:2023-04-29 09:47:03.0  )
ప్యారాచూట్ కొబ్బరి నూనె జుట్టుకు పెట్టుకునేది కాదా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొబ్బరి నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేది మారికో కంపెనీ తయారు చేసే ప్యారాచుట్ కోకోనట్ ఆయిల్. చాలామంది ఈ ఆయిల్‌ను జుట్టుకు వాడుతుంటారు. అయితే అది నిజంగా హెయిర్ ఆయిల్? ఎందుకంటే.. ఆ డబ్బాపై ఎంత వెతికినా.. హెయిర్ ఆయిల్ అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే.. అది కుకింగ్ ఆయిల్ అట. యాడ్స్‌లో మాత్రం దాన్ని హెయిర్ ఆయిల్‌గా చూపిస్తారు. కుకింగ్ ఆయిల్‌పై ఎక్సైజ్ సుంకం తక్కువ ఉంటుంది. అదే కాస్మోటిక్స్ భాగమైన హెయిర్ ఆయిల్‌కు అధిక సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

సో.. అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు ఎగ్గొట్టేందుకే ఈ ఆయిల్‌ను కుకింగ్ ఆయిల్‌గా చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వమే ప్యారాచుట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, అది హెయిర్ ఆయిల్ అని, దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. అది నిజంగా వంట నూనె అని.. పేదవారు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని తెలివిగా ఆ సంస్థ సమాధానం ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed