Ozempic: ట్రెండ్ వేవ్‌లో దూసుకుపోతున్న ‘ఓజెంపిక్’ డ్రగ్.. కారణం ఏంటంటే..!

by Prasanna |   ( Updated:2023-03-08 09:47:52.0  )
Ozempic: ట్రెండ్ వేవ్‌లో దూసుకుపోతున్న ‘ఓజెంపిక్’ డ్రగ్.. కారణం ఏంటంటే..!
X

దిశ, ఫీచర్స్: ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్ ప్రభావం తగ్గించగల ఇంజెక్టెడ్ మెడిసిన్. మెట్‌ఫార్మిన్‌ను తీసుకోలేనివారి దీనిని సొంతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక పీర్ రివ్యూడ్ పరిశోధనలో దాదాపు మూడు వంతుల మంది దీనిని వాడటం ద్వారా తమ శరీర బరువులో 10 శాతానికి పైగా తగ్గారని తేలడంతోపాటు అది సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అది యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అయినప్పటికీ అధిక బరువు తగ్గేంచే అద్భుతమైన ఔషధంగా సోషల్ మీడియాలో జనాదరణ పొందింది.

డిమాండ్ పెరగడంతో సమస్య

ఓజెంపిక్ (ozempic) అనే యాంటీ డయాబెటిస్ ఔషధం బరువు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్‌ సహా పలు ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఓజెంపిక్ హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న వీడియోలకు 6 వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ డ్రగ్ సోషల్ మీడియా ట్రెండ్‌ల వేవ్‌లో దూసుకుపోతోంది. అయితే దీనికి పెరుగుతున్న ఆదరణ చివరికి ఆ ఔషధం కొరతకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘‘మూడు నెలల్లోపు 40 కిలోల బరువు తగ్గడం ఓజెంపిక్ డ్రగ్స్ వల్ల సాధ్యమైంది’’ అని ఫ్రెంచ్‌కు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు అతికొద్ది సమయంలోనే 50 వేల వ్యూస్ వచ్చాయి. పైగా అందరూ దాని వినియోగం గురించి చర్చించారు.

ఎవరు తయారు చేశారు

ఓజెంపిక్ అనేది డానిష్ ఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నార్డిస్క్ (Novo Nordisk)తయారు చేసిన యాంటీ డయాబెటిక్ డ్రగ్, ఇది ఇంజెక్ట్ చేయగల మెడిసిన్. మొదట్లో టైప్ 2 డయాబెటిస్‌ బాధితుల ట్రీట్‌మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా దీనిని వినియోగించారు. ఈ ఔషధం శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆకలి తగ్గించేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

బరువు తగ్గిస్తుందేమోకానీ

2021 ప్రారంభంలో ఓజెంపిక్ ఔషధాన్ని ఉపయోగించిన దాదాపు మూడు వంతుల మంది తమ శరీర బరువులో 10 శాతానికిపైగా కోల్పోయిన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రీడ్ ప్రివ్యూ రీసెర్చ్ సంస్థ పరిశోధకులు కూడా అది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొనడంతో ఓజెంపిక్ వాడకం దారి తప్పింది. డయాబెటిస్ పేషెంట్లు మాత్రమే కాకుండా అధిక బరువు ఉన్నవారు వాడటం ప్రారంభించారు. అలా వాడవద్దని నిపుణులు సూచిస్తున్నా ఆగడం లేదు. ‘‘ఇది మధుమేహం లేనివారు, లేదా టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులకు వాడాల్సిన ఔషధం కాదు. వ్యాధి నిర్ధారణ తర్వాత డాక్టర్ల సూచన మేరకు వాడాల్సింది’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక ఫ్రాన్స్‌‌డ్రగ్ కంట్రోల్ సంస్థ (France's medicines regulator) మాత్రం ఓజెంపిక్‌ను కేవలం డయాబెటిస్ బాధితులకు మాత్రమే సూచించాలని మెడికల్ ప్రాక్టీషనర్లను, వైద్య నిపుణులను కోరుతోంది.

సైడ్ ఎఫెక్ట్స్

ఓజెంపిక్ (Ozempic) ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉండటంతో దాని కొరత ఏర్పడుతోందని, ఉత్పత్తి వనరులు సరిపోవడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్ పేషెంట్లు కానివారు దీనిని వాడకూడదని సూచిస్తున్నారు. అలా వాడటంవల్ల కాస్త బరువు తగ్గినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. అంతేకాదు ఓజెంపిక్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని, బిలియరీ డిజార్డర్స్, ప్రేగు అవరోధానికి దారితీసే తీవ్రమైన మలబద్ధకం తదితర ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఉమెన్స్ డే స్పెషల్.. అక్కడ మగవాళ్లకు వంటల పోటీలు

Advertisement

Next Story

Most Viewed