మరో ఘనత సాధించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.. ప్రపంచంలోనే మొదటిసారి లంగ్ కేన్సర్‌కు వ్యాక్సిన్!

by Anjali |
మరో ఘనత సాధించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.. ప్రపంచంలోనే మొదటిసారి లంగ్ కేన్సర్‌కు వ్యాక్సిన్!
X

దిశ, ఫీచర్స్: పెద్దపేగులో కనిపించే అతి పెద్ద సమస్య క్యాన్సర్. ఈ వ్యాధితో ప్రతి ఏటా వేల మంది మరణిస్తున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ లక్షణాల్లో ఊపిరితిత్తుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, అలసట, ఛాతీ నొప్పి , అరచేతులు, పాదాల వాపు, కామెర్లు, మలబద్ధకం వంటివి ప్రధాన లక్షణాలు. అయితే తాజాగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రపంచంలోనే మొదటిసారిగా వ్యాక్తిన్ కనుగొంది బ్రిటన్ కు చెందిన పరిశోధకుల బృందం. వివరాల్లోకెళ్తే..

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, లండన్ యూనివర్శిటీకు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్ కనుగొని క్యాన్సర్ విషయంలో ఓ గ్రేట్ రిలీఫ్ ఇచ్చే గుడ్‌ న్యూస్ ను తెలిపారు. ఈ వ్యాక్సిన్ లంగ్ క్యాన్సర్ కణాలు, ఉత్పరివర్తనాలుగా రూపాంతరం చెందే ప్రమాదకర ప్రోటీన్‌ను గుర్తించి ఇమ్యూనిటీ వ్యవస్థకు శిక్షణనిచ్చే డీఎన్ఎను యూస్ చేసుకుంటుంది. ‘‘LungVax’’ గా పిలిచే ఈ వ్యాక్సిన్ గతంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్‌ను పోలి ఉంది. ఈ పరిశోధకులు స్టార్టింగ్ లో మూడు వేల వ్యాక్సిన్లు తయారు చేయనున్నారు.

నియో యాంటీజెన్స్ అనే ప్రమాదకర ప్రోటీన్లను గుర్తించి ఈ వ్యాక్సిన్ నాశనం చేస్తుంది. లంగ్స్ లో కణాలు అదుపు తప్పి విచ్చలవిడిగా పెరిగితే మెటాస్టాసిస్ ప్రక్రియతో కేన్సర్ లంగ్స్ చుట్టూ ఉన్న అవయవాలకు సైతం వ్యాపించడం విశేషం. ఈ కారణంగా బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం 50వేల పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. అందులో 35 వేల మంది చనిపోతున్నారు. ప్రతి 10 కేసుల్లో 7 కేసులు ధూమపానం వల్ల వస్తున్నాయి. ప్రస్తుతం ‘‘LungVax’’ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే పరిశోధకులు మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Next Story