Overthinking : ఓవర్ థింకింగ్ అధిక రక్తపోటుకు దారితీస్తుందా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

by Javid Pasha |   ( Updated:2024-10-15 16:47:39.0  )
Overthinking : ఓవర్ థింకింగ్ అధిక రక్తపోటుకు దారితీస్తుందా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో ఒత్తిడితోపాటు అతి ఆలోచనలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే విషయం తెలిసిందే. అయితే అవి పరోక్షంగా నిద్రలేమి, తలనొప్పి, గుండె దడ, అధిక రక్తపోటు వంటి సమస్యలకు కూడా దారితీస్తాయని మానసిక నిపుణులు అంటున్నారు. అందుకే బాధితులు వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి అనేది కామన్ అయిపోయింది. అయితే దానికి ఓవర్ థింకింగ్ కూడా తోడైతే ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైగా ప్రతీ చిన్న విషయానికి అతిగా ఆలోచించే ధోరణి ఇటీవల పెరుగుతోందని చెప్తున్నారు. దీంతో రాత్రిళ్లు నిద్ర నాణ్యత తగ్గడం, క్రమంగా నిద్రలేమికి దారితీయడం, యాంగ్జైటీ, గుండెదడ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే అవి డిప్రెషన్, పక్షవాతం, గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటపడే మార్గం ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఓవర్ థింకింగ్ నుంచి బయట పడేందుకు చక్కటి మార్గం బాధితులు తమ పనులపై ఎక్కువగా ఫోకస్ చేయడం. అలాగే యోగా, మెడిటేషన్, వివిధ వ్యాయామాలు రెగ్యులర్‌గా ఉండేలా చూసుకోవడం ద్వారా అతి ఆలోచనలను డైవర్ట్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో ఓవర్ థింకింగ్‌కు దారితీసిన పరిస్థితులు, వాటికి మూల కారణాలు తెలుసుకొని నివారించే ప్రయత్నం చేయాలి. ప్రతికూల ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు అవసరమైన సానుకూల ఆలోచనలను ప్రాక్టీస్ చేయడం, ఒంటరిగా కాకుండా ఎప్పుడూ నలుగురిలో ఉండటం, ఏదైనా వర్క్‌లో నిమగ్నం కావడం వంటివి చేయాలంటున్నారు మానసిక నిపుణులు. దీంతోపాటు పుస్తకపఠనం, ప్రకృతి ఆస్వాదన కూడా పనిచేస్తాయి. అప్పటికీ పరిష్కారం లభించకపోతే మానసిక నిపుణులను సంప్రదించడం ద్వారా తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More..

Fear of failure: భయమే సక్సెస్‌కు అసలు అడ్డంకి.. ఈ లక్షణాలే నిదర్శనం!

Advertisement

Next Story

Most Viewed