హోలీ రోజు మహిళలను చూస్తే ఏం జరుగుతుంది..?

by Nagaya |   ( Updated:2023-03-08 09:51:34.0  )
హోలీ రోజు మహిళలను చూస్తే ఏం జరుగుతుంది..?
X

దిశ, వెబ్‌డెస్క్: హోలీ అంటే ఉత్సాహానికి ప్రతీక. రంగులు చల్లుకుంటూ చిన్న, పెద్ద, ఆడ, మగ కలిసి ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ. ఈ హోలీ పండుగ ఎప్పుడు వస్తుందా అని యువతీయువకులు ఎదురు చూస్తుంటారు. యూత్‌కు ఎంతో ఎంజాయ్ మెంట్‌గా ఉండే ఈ పండుగ రోజు ఓ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. హోలీ రోజు మహిళలను చూడకూడదనే వింత పద్ధతిని రెండు శతాబ్దాలు ఆచరిస్తున్నారట. ఇంతకూ ఆ ఆచారం ఏంటి.. ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

రాజస్థాన్‌లోని నగర్ గ్రామంలో హోలీ పండుగను వింతగా చేసుకుంటారు. ఈ పండుగలో కేవలం మహిళలే పాల్గొంటారు. పురుషులకు ఎలాంటి భాగస్వామ్యం ఉండదు. అంతేకాదు.. ఐదేళ్లు పైడి వయసున్న పిల్లాడి నుంచి వృద్ధులకు వరకు హోలీ రోజు గ్రామాన్ని విడిచి వెళ్లాలి. ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండా మాత ఆలయానికి వెళ్లి పొద్దంతా అక్కడే గడపాలి. తెల్లవారు జామున్నే వెళ్లి గ్రామంలో హోలీ ఉత్సవాలు ముగిశాయని కబురు అందేవరకు ఏ ఒక్కరూ గుడి నుంచి అడుగు బయటపెట్టవద్దు. జబ్బుల బారిన పడిన పురుషులు, కదలలేని వారు ఇళ్లల్లో ఉండవచ్చు కానీ గడప దాటి బయటికి రావద్దు. ఒకవేళ ఏ పురుషుడైనా హోలీ వేడుకల్లో పాల్గొన్న మహిళలను చూసినా.. గ్రామంలోకి ప్రవేశించినా.. కొరడా దెబ్బలు తినాల్సిందే. ఈ ఆచారాన్ని 200 ఏళ్లుగా ఈ గ్రామంలో పాటిస్తున్నారు. ఇప్పటికి కూడా దీనినే ఫాలో అవుతున్నారు అక్కడి గ్రామస్తులు. గ్రామంలో మహిళలు మాత్రం రంగులు పూసుకుంటూ ఊరంతా కలియ తిరుగుతూ హోలీ సంబురాలను చేసుకోవడం విశేషం. హోలీ వేడుకల అనంతరం మహిళలు స్నానాలు ఆచరించిన తర్వాత మగవాళ్లు గ్రామంలోకి అడుగు పెడతారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ ఈ ఆచారాన్ని పాటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి : హోలీని రంగులతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Advertisement

Next Story