మహిళల్లో ఒబేసిటీ.. నిర్లక్ష్యం చేస్తే ఈ భయంకరమైన సమస్యలకు దారితీయవచ్చు!

by Javid Pasha |
మహిళల్లో ఒబేసిటీ.. నిర్లక్ష్యం చేస్తే ఈ భయంకరమైన సమస్యలకు దారితీయవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కొందరిలో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఒబేసిటీ లేదా ఊబకాయం బారిన పడిన మహిళల్లో క్యాన్సర్లు, డయాబెటిస్, హార్ట్ ఇష్యూస్, గర్బాశయ క్యాన్సర్లు పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు ఊబకాయం ఇంకా ఏయే సమస్యలకు దారితీస్తుందో చూద్దాం.

రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది

ఒబేసిటీ అందరికీ ఒకేలాంటి ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ మహిళల విషయంలో కొన్ని ప్రభావాలు సామాజికంగా, శారీరకంగా ఎక్కువ ఇబ్బందులను కలిగిస్తాయి. దీంతోపాటు అధిక శరీర కొవ్వు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను దెబ్బతీస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలను గుర్తించడంలో, నాశనం చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. క్యాన్సర్‌గా మారేవాటితోపాటు అసాధారణ కణాలను గుర్తించడంలో వాటిని రిమూవ్ చేయడంలో ఇమ్యూనిటీ సిస్టమ్ కీలకపాత్ర పోషిస్తుంది. కానీ ఊబకాయం ఈ వ్యవస్థకు ఆటంకంగా మారుతుంది. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ బాధితుల్లోని క్యాన్సర్ కణాలను గుర్తించడంలో, దాడి చేయడంలో విఫలం అవుతుంది.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

ఊబకాయం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. ఇలాంటి హెచ్చు తగ్గులు స్టమక్ క్యాన్సర్‌కు, ఒవేరియన్ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అలాగే బాడీలోని కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది రీ ప్రొడెక్టివ్ సిస్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ రుతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువగా ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అదనపు ఈస్ట్రోజెన్ గర్భాశయం లైనింగ్ చాలా మందంగా పెరగడానికి కారణం అవుతుంది. దీనిని ‘ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా’ అని కూడా పిలుస్తారు. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌గా మారుతుంది. అలాగే ఊబకాయం ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిలకు దారితీస్తుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్స్

స్త్రీలలో ఊబకాయం తెచ్చే మరో సమస్య ఏంటంటే.. ఇన్సులిన్ నిరోధకత. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో సహాయపడే హార్మోన్ అయినటువంటి ఇన్సులిన్‌కు శరీర కణాలు తక్కువగా రియాక్ట్ అయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది రక్తప్రవాహంలో ఇన్సులిన్ అధిక స్థాయికి దారితీస్తుంది. గర్భాశయంలోని ఎండోమెట్రియల్ కణాలు ఈ ప్రభావాలకు ప్రత్యేకించి సున్నితంగా ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధితో ఇన్సులిన్ నిరోధకత కీ రోల్ పోషిస్తుంది.

నివారణ ఎలా?

ఊబకాయం గర్భాశయ క్యాన్సర్‌ను, ఇతర సమస్యలను ఎలా డెవలప్ చేస్తుందో అవగాహన పెంచుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించేందుకు అవసరమైన వ్యాయామాలు లేదా శారీరక శ్రమను కలిగి ఉండాలి. దీంతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవడం, హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒబేసిటీ తద్వారా తలెత్తే ఇతర సమస్యలను నివారించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed