Creative Skills : రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారిలోనే తెలివి అధికం

by Sujitha Rachapalli |
Creative Skills : రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారిలోనే తెలివి అధికం
X

దిశ, ఫీచర్స్ : తాజా అధ్యయనం ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేసింది. సాధారణంగా రాత్రి త్వరగా పడుకునే వారు ఆరోగ్యవంతులు, ఇంటెలిజెంట్స్ అనే ముద్ర పడిపోయింది. కానీ వీరికన్నా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించేవారే ఉన్నతమైనవారని, తెలివిమంతులు అని తేలింది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు ఇంటెలిజెన్స్, రీజనింగ్, రియాక్షన్ టైమ్, మెమరీ పరీక్షలను పూర్తి చేసిన 26,000 డేటాను అధ్యయనం చేశాక ఈ ఫలితాలను గుర్తించారు. నిద్ర వ్యవధి, నాణ్యత, క్రోనోటైప్ మెదడు పనితీరును ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు.

ఆలస్యంగా నిద్రపోయే వారు బెస్ట్ కాగ్నిటివ్ స్కిల్స్ కలిగి ఉండగా.. త్వరగా పడుకునేవారు అత్యల్ప స్కోర్ పొందారు. అంటే లేట్ నైట్స్ మేల్కొనడం అనేది క్రియేటివిటీతో ముడిపడి ఉంటుంది. అయితే ఇక్కడ నిద్ర వ్యవధి మాత్రం ఇంపార్టెంట్. రోజూ రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర కచ్చితంగా అవసరం. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, ఉత్తమంగా పనిచేయడానికి చాలా కీలకం. లేదంటే జ్ఞానం, సామర్థ్యంలో క్షీణత కనిపిస్తుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కాగా నైట్ ఓల్స్ లిస్ట్ లోని కళాకారులు, రచయితలు, సంగీతకారులలో హెన్రీ డి టౌలౌస్-లౌట్రెక్, జేమ్స్ జాయిస్, కాన్యే వెస్ట్, లేడీ గాగా ఉండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed