Rakhi : రాఖీ ఎప్పుడూ పాతరకమేనా.. మన బ్రదర్ కోసం కాస్త కొత్తగా ఆలోచిద్దాం..

by Jakkula Samataha |
Rakhi : రాఖీ ఎప్పుడూ పాతరకమేనా.. మన బ్రదర్ కోసం కాస్త కొత్తగా ఆలోచిద్దాం..
X

దిశ, ఫీచర్స్ : అన్నాచెల్లెళ్లకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగ వచ్చేస్తుంది. చాలా మంది ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇక అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడుతూ స్వీట్ తినిపించి, తమకు ఇష్టమైన గిఫ్ట్స్‌ను బ్రదర్స్ నుంచి పొంది సంతోషపడతారు. ఇక ఇప్పుడు రాఖీ పండుగ వచ్చేస్తుంది. ఆగస్టు 19 వ తేదీన ప్రజలందరూ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో తమ బ్రదర్స్ కోసం, సిస్టర్స్ ఇప్పటి నుంచే, ఎలాంటి రాఖీ తీసుకోవాలి, ఏ డిజైన్ తీసుకుంటే బాగుంటుందని తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా, అన్నాతమ్ముళ్ల‌ను రాఖీ రోజు ఆనంద పరచడానికి, పాతరకం కాకుండా కాస్త కొత్తగా ఆలోచించి ట్రెడీ రాఖీలు తీసుకోవాలనుకుంటున్నారా? మీ కోసమే ఈ కొత్తరకం డిజైనరీ రాఖీలు. అవి ఏవో ఓలుక్ వేద్దాం.

సీడ్ రాఖీలు: పర్యావరణ ప్రేమికులైన మీ సోదరునికి ఏం రాఖీ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు కదా.. అయితే అలాంటి వారికి సీడ్ రాఖీలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాఖీ విత్తనానికి తొడుగులా లేదా, మంచి డిజైన్ మధ్య విత్తనం అతికించి ఉంటుంది. పర్యావరణ ప్రేమికులకు ఈ రాఖీ ఎంతగానో నచ్చుతుంది.

పప్పులు,మసాలా దినుసుల రాఖీలు : రాఖీలు ఏవైనా సరే నెమలి పించం, మంచి డిజైన్, ఓంకారం, బ్రదర్ అని రాసి ఉన్న రాఖీలు మాత్రమే మార్కెట్‌లో ఎక్కవ అందుబాటులో ఉంటాయి. కానీ మీ బ్రదర్‌ని ఈ పండగ సమయంలో సర్ప్రైజ్ చేయాలనుకుంటే, మీ ఇంట్లో ఉన్న పప్పులు లేదా మసాలా దినుసులు లవంగం, యాలకులతో రాఖీలు తయారు చేసి మీ సోదరుడికి కడితే అది వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంది.

సీక్రెట్ ఫోటో రాఖీలు : మీకు మీ సోదరుడిపై ఎంత ప్రేమ ఉందో తెలపాలంటే? మీ సోదరుడికి ఫోటో ఫ్రేమ్ రాఖీ కట్టి సర్పైజ్ చేయవచ్చు. ఈ రాఖీ మామూలు రాఖీలా కనిపించినప్పటికీ అది తెరవగానే ఐదు లేదా ఆరు మినీ ఫోటోలు బయటకు వస్తాయి. ఇది చూడటానికి చాలా బాగుంటుంది.

మ్యాజికల్ రాఖీ : మీ కుటుంబంలోని చిన్న పిల్లలకు రాఖీ కట్టాలనుకుంటే వారికి మ్యూజికల్ రాఖీస్ కట్టడం చాలా బెటర్. ఎందుకంటే వారు ఎంజాయ్ చేస్తారు. రాఖీలో చిన్న స్పీకర్ ఉంటుంది. అందులో రైమ్ లేదా మంత్రం రికార్డ్ చేసి ఉంటుంది. దాంతో వారు రాఖీలో వచ్చే సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తుంటారు.

Advertisement

Next Story