శృంగారం కాదట.. పోషకాలు పంచుకోవడమని చెప్తున్న కొత్త సిద్ధాంతం..

by Sujitha Rachapalli |
శృంగారం కాదట.. పోషకాలు పంచుకోవడమని చెప్తున్న కొత్త సిద్ధాంతం..
X

దిశ, ఫీచర్స్: జిరాఫీ ప్రపంచంలోని ఎత్తైన జంతువులలో ఒకటి కాగా. అసాధారణమైన పొడవాటి మెడ వీటి ప్రత్యేకత. అయితే నెక్ ఇంత పొడవుగా పరిణామం చెందేందుకు కారణం మగ జిరాఫీలపై సెక్స్ ఆధిపత్యం కోసమై ఉంటుందని ఇంతకు ముందు అధ్యయనాలు సూచించాయి. కానీ లేటెస్ట్ స్టడీ దీన్ని వ్యతిరేకించింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన జీవశాస్త్రవేత్తలు పోషకాహార అవసరమే ఈ పరిణామానికి దారితీసిందని వెల్లడించారు.

నిజానికి మగ వాటికంటే ఆడ జిరాఫీలు పొడవాటి మెడను కలిగి ఉంటాయని గుర్తించారు. మగ జిరాఫీలకు విశాలమైన మెడలు, పొడవాటి ముందరి కాళ్లు ఉంటాయి. అయితే పొడవైన మెడల పరిణామం వెనుక రహస్యం.. చెట్లలోకి చొచ్చుకుపోయి ఆహారం సేకరించాల్సిన ఆవశ్యకతేనని వివరించారు. ఎందుకంటే ఇవి కొన్ని చెట్ల జాతుల ఆకులను మాత్రమే తింటాయి. పొడవైన మెడ ఆ చెట్లలోకి డీప్ గా వెళ్తేనే వాటిని పొందగలవు. పైగా ఆడ వాటికి నాలుగు లేదా ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత దాదాపు ఎల్లప్పుడూ గర్భవతిగా లేదా పాలిచ్చే పరిస్థితుల్లోనే ఉంటాయి. కాబట్టి పోషకాహార డిమాండ్ పెరుగుతుందని.. పొడవాటి మెడల పరిణామానికి దారితీసిందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed