- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రునిపై మానవుల నివాసం ఈ దశాబ్దంలోనే : NASA
దిశ, ఫీచర్స్ : ఈ దశాబ్దంలోనే మానవులు చంద్రునిపై నివసించే పరిస్థితులు సాధ్యమవుతాయని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భావిస్తోంది. డీప్ స్పేస్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా పనిచేయాలో తెలుసుకునేందుకు అనుమతించే స్థిరమైన ప్లాట్‌ఫామ్, రవాణా వ్యవస్థను కలిగి ఉండేందుకు ఆర్టెమిస్ మిషన్స్ తమకు సాయపడతాయని నాసా 'ఓరియన్ లూనార్ స్పేస్‌క్రాఫ్ట్' ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్న హోవార్డ్ హు చెప్పారు.
ప్రజలను చంద్రునిపైకి పంపబోతున్నామని, వారు ఆ ఉపరితలంపై నివసించి చరిత్ర సృష్టించబోతున్నారని హు ఆదివారం వెలువడిన నివేదికలో పేర్కొన్నారు. భూ కక్ష్యకు మించి కొంచెం నేర్చుకోవడం, ఆ తర్వాత అంగారక గ్రహంపై అడుగుపెట్టడం చాలా ముఖ్యమైందని ఆయన తెలిపారు. 25.5-రోజుల ఆర్టెమిస్ I మిషన్‌లో ఐదు రోజులు ఓరియన్.. చంద్రుని వైపు తన పథంలో కొనసాగుతుంది. సిబ్బందిలేని ఓరియన్ ఆదివారం భూమి నుంచి 232,683 మైళ్లు ప్రయాణించింది. అలాగే చంద్రుని నుంచి 39,501 మైళ్ల దూరంలో గంటకు 371 మైళ్ల వేగంతో ప్రయాణించింది. కాగా దీర్ఘకాలిక డీప్ స్పేస్ అన్వేషణలో యూఎస్‌కు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా ఇది మొదటి అడుగని హు చెప్పారు.
యూఎస్ స్పేస్ ఏజెన్సీ దాని ప్రతిష్టాత్మకమైన, సిబ్బంది లేని ఆర్టెమిస్ I మూన్ మిషన్‌లో భాగంగా గతవారం తన తదుపరి తరం రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఇది ఇప్పటికే సంవత్సరాల ఆలస్యంతో పాటు బిలియన్ల డాలర్లు ఖర్చుతో రెండుసార్లు విఫల ప్రయత్నాలను ఎదుర్కొంది. మొత్తానికి ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి బయలుదేరిన స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్.. ఓరియన్ అంతరిక్ష నౌకను చంద్రుని కక్ష్యకు పంపింది. ప్రస్తుతం చంద్రునిపై కొనసాగుతున్న ఓరియన్ డిసెంబర్ 11న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున చాలా రోజుల పాటు కక్ష్యలో ఉంటుంది.
ఇక 1972లో అపోలో 17 మిషన్ తర్వాత మొదటిసారి సిబ్బందితో కూడిన మూన్ ల్యాండింగ్స్‌ను 2025లో ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. అందులో చంద్రునిపై నడిచిన మొదటి మహిళ కూడా ఉండనుంది. ఈ క్రమంలోనే ఆర్టెమిస్ I.. డీప్ స్పేస్‌లో మానవ అన్వేషణకు పునాదిని అందజేస్తుంది. చంద్రునిపై, వెలుపల మానవ ఉనికిని విస్తరించేందుకు నాసా నిబద్ధత, సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది.