- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎముకల్ని దెబ్బతీసే మైలోమా క్యాన్సర్.. గుర్తించగానే ఏం చేయాలంటే..
దిశ, ఫీచర్స్: క్యాన్సర్లలో అనేక రకాలుంటాయి. అలాంటి వాటిలో మైలోమా ఒకటి. ఇది ఒక రకమైన బోన్‌మ్యారో క్యాన్సర్‌గా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో రక్త కణాలను ఉత్పత్తి చేసే కొన్ని ఎముకల మధ్యలో ఉండే మెత్తటి కణజాలమే బోన్ మ్యారో. మైలోమా క్యాన్సర్ వెన్నెముక, పుర్రె, పక్కటెముకలను తరచూ ప్రభావితం చేస్తుంది. ఇందులో మల్టిపుల్ మైలోమా అనేది చాలా అసాధారణమైనది. ఇది ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది.
లక్షణాలు
ఎముకలలో నొప్పి, అలసట, శారీరక బలహీనత, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం మైలోమా క్యాన్సర్‌లో కనిపించే లక్షణాలు. అయితే క్యాన్సర్ లేనప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి కాబట్టి మైలోమా గా గుర్తించడం అంత ఈజీ కాదు. అందుకే లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లను సంప్రదించి నిర్ధారణ చేయించుకోవాలి. లేకపోతే మైలోమా ఎముకలను దెబ్బతీసి ఆరోగ్యకరమైన రక్త కణాల ఉత్పత్తిని అడ్డుకునే ప్రమాదం ఉంటుంది.
నిర్ధారణ ఎలా?
మైలోమా, మల్టిపుల్ మైలోమాలో బ్లడ్ టెస్ట్ కీలకం. ఇది రోగనిరోధక ఎలెక్ట్రోఫోరేసిస్ ద్వారా రక్తంలోని ప్రోటీన్ వంటి నిర్దిష్ట ప్రోటీన్‌ల స్థాయిలను గుర్తించేందుకు తోడ్పడుతుంది. బ్లడ్, యూరినల్ టెస్టులతోపాటు ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్, కిడ్నీ బయాప్సీలు వంటి ఇతర టెస్టులు కూడా మల్టిపుల్ మైలోమాను నిర్ధారించడానికి చేస్తారు.
ట్రీట్‌మెంట్
మైలోమా ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే ట్రీట్‌మెంట్ అవసరం లేదు. కానీ తప్పక తీసుకోవాలి. ఒక్కోసారి ఈ వ్యాధి ఎలాంటి సమస్యలను కలిగించకపోవచ్చు. కొన్నిసార్లు లక్షణం లేని లేదా స్మోల్డరింగ్ మైలోమాగా కూడా ఉండవచ్చు. ఈ మైలోమా క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, స్టెరాయిడ్స్, బోర్టెజోమిబ్, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అనే రకాలు ఉంటాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్, జీన్ థెరపీ, ఇమ్యునోథెరపీల్లో కొత్త అధ్యయనాలు మైలోమా ట్రీట్ మెంట్‌కు దోహదపడుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి: స్త్రీలు, పురుషులు ఏ రోజుల్లో తలస్నానం చేస్తే మంచిదో తెలుసా?