పెళ్లి కాని యువతుల యోని లూజ్ కావడానికి కారణం ఇదే..!

by Nagaya |
పెళ్లి కాని యువతుల యోని లూజ్ కావడానికి కారణం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి కాని యువతుల్లో శృంగారంపై చాలా అనుమానాలు ఉంటాయి. అలాగే వివాహమై.. సంసారం చేస్తున్న మహిళల్లోనూ అపోహలు ఉంటున్నాయి. ఇలాంటి వాళ్లు డాక్టర్ల నోరువిప్పి చెప్పలేరు.. సిగ్గుతో స్నేహితులతో పంచుకోలేరు. ఇలా శృంగారంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసుకోలేక సతమతమవుతుంటారు. ప్రధానంగా యోని సైజ్ విషయంలో చాలా అపోహలు పడుతుంటారు. అతిగా సెక్స్ చేస్తే యోని సైజ్ పెరుగుతుందని.. హస్తప్రయోగం చేసుకుంటే లూజ్ అయిపోతుందని అనుమానాలతో మానసికంగా కృంగిపోతుంటారు. కానీ దీనిపై వైద్యనిపుణులు పూర్తి క్లారిటీ ఇస్తున్నారు. అదేంటో చూద్దాం.


శృంగారంలో పాల్గొన్నా, హస్తప్రయోగం చేసినా యోని లూజ్ అవుతుంది.. పెళ్లి కాగానే శోభనం రోజు భర్త గుర్తు పట్టేస్తాడు.. అనేది యువతుల్లో, మహిళల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకం. అయితే యోని లూజ్‌కు శృంగారానికి సంబంధమే లేదంటున్నారు వైద్యులు. ఇదేలాగో వివరిస్తున్నారు. యోని కూడా నోరులాంటిదేనట. ఆహారం తినేటప్పుడు మనం నోట్లో పెట్టుకునే పరిమానాన్ని బట్టి నోరు సాగుతోంది. ఆ తర్వాత మాములు స్థితికి చేరుకుంటుంది. అదే విధంగా స్త్రీ యోని కూడా సెక్స్, హస్తప్రయోగం సమయంలో పురుషాంగం లేదా సెక్స్ టాయ్స్ సైజ్‌కు సాగుతుందట. కామోద్రేకం తగ్గిన తర్వాత మళ్లీ యధాస్థితికి చేరుకుంటుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.


అలాగే యోని కండరాల్లో టెంపర్ ఉంటుంది. వీటికి సాగే గుణం ఉంటుంది. ఇది పురుషాంగం ఆకారం, సైజ్‌కు అనుగుణంగా సాగడంతోపాటు గట్టిగా పట్టి ఉంచడానికి సహాయపడుతుంది. సెక్స్ అనంతరం టెంపర్ తగ్గి మళ్లీ కండరాలు యధాస్థితికి వస్తుంది. అయితే కొందరి మహిళలకు కండపుష్టి ఉండటం, మరికొందరు సన్నగా ఉండటం వల్ల వాళ్ల యోని కండరాల్లో టెంపర్‌లో తేడాలు ఉంటాయి. టెంపర్ తక్కువగా ఉన్న యువతులు సెక్స్‌లో పాల్గొనకపోయినా యోని లూజ్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు పెళ్లి చేసుకున్న తర్వాత యోని సైజ్ పెద్దగా ఉన్నదని భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయని డాక్టర్ సమరం పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.


అయితే అది కండరాల తప్పిదమే కానీ మహిళల తప్పు కాదని, కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటే టెంపర్ ఎక్కువగా ఉంటుందని.. దాని వల్లనే యోని సైజుల్లో తేడాలు ఉంటాయని, సెక్స్, హస్త ప్రయోగం చేస్తేనే లూజ్ అవుతుందనుకోవడం అపోహ మాత్రమేనని డాక్టర్ సమరం కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై మహిళలు, పురుషులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోని బాగా లూజుగా ఉంటే వెజైనోప్లాస్టీ సర్జరీ ద్వారా బిగుతుగా మార్చుకోవచ్చని ఆయన సూచించారు. కానీ ఇలాంటి సర్జరీ 10 లక్షల మందిలో ఒక్కరికి అవసరం పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి యోని లూజ్‌కు మహిళల శృంగారానికి సంబంధం లేదని లైఫ్ పార్టనర్స్ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed