- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేరుశనగలో అద్భుత పోషకాలు.. దీర్ఘకాలిక వ్యాధుల నివాణలో కూడా..
దిశ, ఫీచర్స్ : వేరు శనగలు హెల్త్‌కి మంచిదని తెలిసిందే. అయితే వీటిలోని కొన్ని ప్రత్యేక పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నివారణలోనూ అద్భుతంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో భాగంగా వాటిని వివిధ రూపాల్లో తీసుకోవడంవల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. అవేంటో చూద్దాం.
* మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వేరు శనగల్లో ప్రోటీన్ కంటెంట్ ఫుల్లుగా ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇవి శరీరానికి శక్తినిచ్చే పవర్ ఫుల్ నట్స్ అంటున్నారు నిపుణులు.
* దాదాపు 8 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి కాబట్టి వేరు శనగలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అర్జినైన్ అనే సమ్మేళనం ప్రోటీన్ ఉత్పత్తికి దోహదం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీ, అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి. విటమిన్ బి, విటమిన్ ఇ వంటివి కూడా ఉండటంవల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
* డైటరీ ఫైబర్, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ బి, ఇ కలిగి ఉండటం కారణంగా వేరు శనగలు రోగకారక ఇన్ఫెక్షన్ల నివారణలో సహాయపడతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, రెస్వెరాట్రాల్, పి-కౌమారిక్ యాసిడ్ వంటివి అల్జీమర్స్, క్యాన్సర్, ఇతర క్రానిక్ డిసేజెస్ రిస్క్‌ను తగ్గిస్తాయి. రోజువారీ ఆహారంలో వేరు శనగలను తీసుకోవడంవల్ల కారణంగా వీటిలోని మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి. అలాగే విటమిన్లు, ఇతర పోషకాలు కండరాల బలానికి మంచిది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.