- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Geological Mystery : గుడ్లు పెడుతున్న పర్వతం.. అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని దక్కించుకునేందుకు పోటీ పడుతున్న జనం..
దిశ, ఫీచర్స్ : చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని హబ్‌లో ఓ కొండ చాలా ఏళ్లుగా జనాలను అయోమయంలో పడేస్తుంది. చాన్ ద యా అనే కొండ గుడ్లు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ అసాధారణ దృగ్విషయం కారణంగా ఆగ్నేయ చైనీస్ గ్రామం గులు జాయ్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాదాపు 600 పౌండ్ల బరువున్న పెద్ద గుండ్రని రాళ్లను ఉత్పత్తి చేస్తుందని.. ముదురు నీలం రంగులో ఉండే ఇవి పాలిష్ చేయబడినట్లుగా కనిపిస్తాయని చెప్తున్నారు. 20 నుండి 60 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉండే వీటిని అదృష్టాన్ని ఇంటికి తీసుకొస్తాయని నమ్ముతారు. దక్కించుకునేందుకు పోటీ పడతారు.
ఈ రాతి గుడ్లు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి కొండపై నుంచి పడిపోతాయని చెప్తున్నారు స్థానికులు. కానీ శాస్త్రవేత్తలు ఈ సంఘటనకు ఖచ్చితమైన వివరణను అందించలేదు. కేవలం ఆరు మీటర్ల వెడల్పు , 20 మీటర్ల పొడవు ఉండే కొండ.. పరిమాణంలో పెద్దది కాదు. కానీ ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి రాతి గుడ్లు పెడుతుంది. వీటిని దక్కించుకుని అదృష్టవంతులుగా మారేందుకు అక్కడి జనం పొరపాట్లు చేసేందుకు దారి తీస్తుంది.
సందు షుయ్ అటానమస్ కౌంటీలో ఉన్న గులు గ్రామం ఈ ఆధ్యాత్మిక చాన్ ద యా కొండకు దగ్గరగా ఉంటుంది. దాదాపు 2,50,000 షుయ్ జనాభా కలిగిన పురాతన ప్రాంతంలో .. చైనాలోని మొత్తం షుయ్ జనాభాలో 60 శాతానికి పైగా కలిగి ఉంది. ఆ దేశంలోని 56 జాతి మైనారిటీలలో ఒకరైన షుయ్ ప్రజలు.. హాన్ రాజవంశానికి ముందు నుంచి ఇక్కడ నివసిస్తున్నారు.