- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్.. 48 గంటల ముందు ఆర్డర్ చేయాల్సిందే..
దిశ, ఫీచర్స్: న్యూయార్క్‌లోని ‘సెరెండిపిటీ3’ రెస్టారెంట్ తమ కస్టమర్లకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. 2014లో ‘ఫ్లాగ్‌షిప్’ పేరుతో తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్‌ను రూ.17,500 విక్రయించగా.. ఇది అత్యధిక ధరకు అమ్ముడుపోయిన శాండ్‌విచ్‌గా వరల్డ్ గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా సదరు హోటల్ మరోసారి అదే రేంజ్‌లో మరొక శాండ్ విచ్‌ను తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ‘జాతీయ గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్ దినోత్సవం’ను పురస్కరించుకుని ‘క్వింటెస్సెన్షియల్ గ్రిల్డ్ చీజ్’ పేరుతో సరికొత్త శాండ్‌విచ్‌ను ప్రారంభించినట్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా దాని ప్రత్యేకతలు వివరించింది. ‘మేము పరిమిత కాలపు మరో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత వంటకాన్ని తయారుచేయబోతున్నాం. ‘నేషనల్ గ్రిల్డ్ చీజ్ డే’ ఏప్రిల్ 12వ తేదీన న్యూయార్క్‌లోని S3 రెస్టారెంట్‌లో ‘ది క్విన్టెసెన్షియల్ గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్’ తయారీ మొదలైంది. ఈ రుచికరమైన ఓవర్-ది-టాప్ శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేయడానికి 48 గంటల ముందస్తు నోటీసు అవసరం’ అంటూ బ్రెడ్ ముక్కలతోపాటు సూప్ నమూన ఫొటోను షేర్ చేసింది.
ఇక డోమ్ పెరిగ్నాన్, ఫ్రెంచ్ పుల్‌మాన్ షాంపైన్‌లను స్ప్రే చేసి కాల్చిన రెండు బ్రెడ్ ముక్కలపై 23k బంగారు రేకులు ఉంటాయి. మూడు పూతల వెన్నతో కప్పబడిన ఈ పదార్థం.. అరుదైన, చాలా ఖరీదైన కాసియోకావాల్లో పోడోలికో చీజ్‌ను కూడా కలిగి ఉంది. ఆ జున్ను దక్షిణ ఇటలీలో పోడోలికా ఆవు పాలతో తయారు చేయగా.. ఆ ఆవులకు ఫెన్నెల్, లికోరైస్, జునిపెర్, లారెల్ బే, వైల్డర్ స్ట్రాబెర్రీలు వంటి బలమైన సుగంధ గడ్డిని మేతగా వేస్తారు.
ఈ తీపి సుగంధ పరిమళాలతో పాలిచ్చే ప్రత్యేక ఆవులు కేవలం 25,000 మాత్రమే ఉండగా మే-జూన్‌లలో మాత్రమే పాలు ఇస్తాయట. అందుకే ఈ జున్ను ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అరుదైన వాటిలో ఒకటి. అలాగే ఇందులో సాధారణ టొమాటో సూప్‌కి బదులుగా దక్షిణాఫ్రికా లాబ్‌స్టర్ టొమాటో బిస్క్యూతో వడ్డిస్తారు. ఈ బిస్క్యూ దక్షిణాఫ్రికా లాస్‌బెట్ ట్రైల్స్‌తో తయారు చేయబడింది. ఇటలీకి చెందిన శాన్ మార్జానో టొమాటోలతో పాటు ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిర్వహకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: కోడలికి రూ. 500 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇచ్చిన నీతా అంబానీ.. విశేషాలివే..