- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Money saving tips : చేతిలో డబ్బు నిలవడం లేదా..? ఇదిగో మనీ సేవింగ్ టిప్స్!
దిశ, ఫీచర్స్ : మీరు సంతోషంగా జీవించాలంటే బతకడానికి అవసరమైన కనీస అవసరాలైనా తీర్చుకోగలగాలి. అయితే ఇవన్నీ డబ్బుతో కూడా ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరు అవకాశాలు, వనరులను బట్టి తమ తమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడే కొందరు పొరపాట్లు చేస్తుంటారు. ఏంటంటే.. పొదుపు చేసుకోలేకపోవడం. పైగా సంపాదించిన దాని కంటే అతిగా ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల చేతిలో డబ్బు నిలువదు. అత్యవసర పరిస్థితులు ఎదరైనప్పుడు కూడా చిల్లి గవ్వలేక అవస్థలు పడుతుంటారు. జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మంత్లీ 1% నుంచి 5% వరకైనా సరే వచ్చే ఆదాయంలోంచి కొంత భాగాన్ని సేవ్ చేయాలంటున్నారు నిపుణులు. అలాంటి మరికొన్ని మనీ సేవింగ్ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
*ప్రత్యామ్నాయం ఆలోచిచండి : ఈ రోజుల్లో డెబిట్, క్రెడిట్, ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆన్‌లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి. చాలా మంది నగదుకు బదులుగా వాటినే ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కార్డులను ఉపయోగించడం వల్ల మీరు సాధారణం కంటే ఎక్కవ డబ్బును ఖర్చు చేస్తారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మీ కార్డులో నుంచి ఎంత డబ్బు బయటకు వెళ్తుందో పట్టించుకోరు. అదే నగదు మాత్రమే ఉపయోగించినట్లయితే.. మీ చేతిలో ఎంత నగదు ఉందో.. ఎంత ఖర్చు చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తుంది. దీంతో మీరు మితంగా ఖర్చు చేస్తారు. అలా మీ డబ్బు సేవ్ అవుతోంది అంటున్నారు నిపుణులు.
* అత్యవసర నిధి : ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాంటప్పుడు మీ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఖర్చులు తగ్గించడం : చాలా మంది ఉపయోగం లేని వస్తువులు కొనడమో లేక, యూస్ చెయ్యని వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యడమో చేస్తుంటారు. ఇలా అదనపు వస్తువులకు చేసే ఖర్చు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే వారం రోజుల్లో.. ఒక రోజు సున్నా ఖర్చు అనే రోజుగా పెట్టుకోండి. ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చెయ్యకుండా డబ్బును సేవ్ చెయ్యండి. ప్రతీ వారం మీ ఖర్చును తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు.
రిచార్జ్ ప్లాన్స్: ఈ రోజుల్లో చాలా మంది బడ్జెట్‌కు మించిన ప్లాన్‌ని ఎంచుకుంటారు. మీరు మీ ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో బాగా పరిశీలించండి. మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన ప్లాన్‌లను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎక్కువ డేటాను ఉపయోగించనప్పటికీ రిచార్జ్ ప్లాన్ మాత్రం భారీగా చేసుకుంటారు. అలాగే ఇంట్లో ఉండే టీవీ రిచార్జ్ ప్లానింగ్‌లోనూ అలాంటి తప్పులే చేస్తే సరిదిద్దుకోండి. టీవీ ప్లాన్‌లో మీకు ఉన్న అన్ని ఛానెల్‌లు నిజంగా అవసరమా అది కూడా ఆలోచించండి. అలా మీరు చూసే చానెల్స్‌కు మాత్రమే రిచార్జ్ చేయించుకుంటే ఖర్చు కొంత తగ్గుతుంది.
* పార్టీలు, విహార యాత్రలు : కొందరు ఏ అవకాశం వచ్చినా పార్టీలు, విహార యాత్రలంటూ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఇంట్లోనే సరదాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యండి. దీంతో డబ్బు కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక ఈ రోజుల్లో అందరూ సొంత వాహనాలపైనే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు కారు, లేదా బైక్‌ను ఉపయోగించడం కంటే ప్రజా రవాణాను ఉపయోగిస్తే ఎంతో కొంత ఆదా అవుతుంది. అలాగే లాంగ్ జర్నీస్‌లో బయట ఫుడ్ తినడం కంటే మీ కోసం, మీ పిల్లల కోసం ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ప్యాక్ చేయండి. డబ్బు సేవింగ్‌తో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది.
* ఇలా కూడా ట్రై చేయొచ్చు : చాలా మంది ఇళ్లల్లో ఉండే స్టోర్ రూమ్‌లో అవసరం లేని వస్తువులు చాలా ఉంటాయి. అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. వాటిని ఎందుకు అమ్మకూడదు? ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో వస్తువులను విక్రయించడం గతంలో కంటే సులభం. దీని ద్వారా కాస్త డబ్బును సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా పాత వస్తువు ప్లేస్‌లో కొత్తది కొనాలి అనుకున్నప్పుడు.. పాతదాన్ని రీప్లేస్ చేసుకున్న కూడా డబ్బు ఆదా అవుతోంది.
* బాటిల్ వాటర్: మరో ముఖ్యమైన విషయం బాటిల్ వాటర్. ఈ విషయంలో చాలా మంది అనుకోకుండానే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తారు. రోజుకు రూ. 20 కదా అనుకుంటారు. కానీ నెలకు ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి. అలా కాకుండా ట్యాప్ వాటర్ తాగేందుకు మీరు ఇష్టపడనట్లు అయితే.. మీ వంటగదిలో వాటర్ ఫిల్టర్ పెట్టించుకోండి. ఇది ముఖ్యమైన పెట్టుబడి అయినప్పటికీ.. రోజూ బాటిల్ వాటర్ కొనుగోలు చేయకుండా మీరు పొదుపు చేసుకుంటారు. అలాగే లాంగ్ టెర్మ్ సేవింగ్స్‌కు ఇది ఉపయోగపడుతోంది.